‘వంశధార’పై నవంబరు 11న తుది విచారణ

ప్రధానాంశాలు

Published : 25/09/2021 04:58 IST

‘వంశధార’పై నవంబరు 11న తుది విచారణ

ఒడిశా వేసిన మూడు కేసులపై సుప్రీం నిర్ణయం

ఈనాడు, దిల్లీ: వంశధార ట్రైబ్యునల్‌ తీర్పు, నేరడి బ్యారేజ్‌ నిర్మాణాన్ని సవాల్‌ చేస్తూ ఒడిశా దాఖలు చేసిన మూడు పిటిషన్లపై నవంబరు 11న తుది విచారణ చేపడతామని జస్టిస్‌ ధనుంజయ్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ బీవీ నాగరత్నలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. శుక్రవారం ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు ఒడిశా తరఫున సీనియర్‌ అడ్వొకేట్‌ గోపాల్‌ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపిస్తూ... సమస్య తీవ్రత, కక్షిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సాధ్యమైనంత త్వరగా విచారణ చేపట్టాలని కోరారు. జస్టిస్‌ ధనుంజయ్‌ చంద్రచూడ్‌ బదులిస్తూ ‘‘ఇలాంటి విషయాలను వాయిదా వేయకూడదు. దీపావళి సెలవుల తర్వాత పోస్ట్‌ చేస్తాం’’ అని తెలిపారు. నవంబరు 11న తుది విచారణ చేపడతామని, ఆరోజు వాదనలు మిగిలిపోతే 16, 17 తేదీల్లో వింటామని స్పష్టం చేస్తూ విచారణ ముగించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన