ఇద్దరు లష్కరే ముష్కరులు హతం

ప్రధానాంశాలు

Updated : 17/10/2021 09:50 IST

ఇద్దరు లష్కరే ముష్కరులు హతం

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. శనివారం పుల్వామా జిల్లా పంపొరా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో లష్కరే కమాండర్‌ ఉమర్‌ ముస్తాక్‌ ఖాండే కూడా ఉన్నాడు. ఈ ఏడాది ఇద్దరు పోలీసుల హత్యలో ముస్తాక్‌ ప్రమేయం ఉందని కశ్మీర్‌ ఐజీపీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. భద్రతా బలగాలు ఇటీవల విడుదల చేసిన టాప్‌ 10 ఉగ్రవాదుల జాబితాలోనూ ఇతను ఉన్నాడన్నారు.

ఇద్దరు స్థానికేతరుల కాల్చివేత 

కశ్మీర్‌లో సాధారణ పౌరుల్ని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు వరుస ఘాతుకాలకు పాల్పడుతున్నారు. శనివారం ఇద్దరు స్థానికేతరుల్ని కాల్చి చంపారు. శ్రీనగర్‌లో ఈద్గా ప్రాంతంలో అర్‌వింద్‌ కుమార్‌ అనే వీధివ్యాపారిపై కాల్పులు జరపగా, అక్కడికక్కడే మృతిచెందాడు. ఇతను బిహార్‌ నుంచి వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్నాడు. మరో ఘటనలో పుల్వామా జిల్లాలో వడ్రంగి పనిచేసే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సాగిర్‌ అహ్మద్‌పై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అతను ఆస్పత్రిలో మృతిచెందాడు.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన