నవంబరు 29 నుంచి పార్లమెంటు సమావేశాలు!

ప్రధానాంశాలు

Published : 23/10/2021 04:51 IST

నవంబరు 29 నుంచి పార్లమెంటు సమావేశాలు!

దిల్లీ: దాదాపు నెల రోజుల పాటు కొనసాగే పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబరు నాలుగో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఉభయ సభలు సుమారుగా 20 సార్లు భేటీ అవుతాయని, క్రిస్మస్‌కు ముందే ఈ సెషన్‌ ముగుస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గత సమావేశాల మాదిరిగానే కొవిడ్‌ నిబంధనలను పాటించనున్నారు. కరోనా ఉద్ధృతి కారణంగా పార్లమెంటు శీతాకాల సమావేశాలను గత ఏడాది నిర్వహించలేదు. బడ్జెట్‌, వర్షాకాల సెషన్లు జరిగినా కొద్ది రోజుల్లోనే ముగించారు. అధికారికంగా ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ శీతాకాల సమావేశాలు నవంబరు 29న ప్రారంభమై డిసెంబరు 23 వరకు కొనసాగవచ్చని తెలుస్తోంది. లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు సమాంతరంగానే ప్రారంభమైనా తొలుత కొన్ని రోజులు వేర్వేరు సమయాల్లో భేటీ అవుతాయి. కొవిడ్‌ నిబంధనల్లో భాగంగా పార్లమెంటు భవనంలో ఒకేసారి అందరూ గుమిగూడకుండా భౌతిక దూరం పాటించడం కోసం ఈ విధమైన ఏర్పాటు చేయవచ్చని సమాచారం. పార్లమెంటు సభ్యులు, సిబ్బంది అందరూ తప్పనిసరిగా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. రాజకీయంగా కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌ సహా అయిదు రాష్ట్రాలకు మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగటానికి ముందుగా నిర్వహిస్తున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన