close

తాజా వార్తలు

ఐసీజే వేదికగా పాక్‌ దుశ్చర్య

పెషావర్‌ ఉగ్రదాడిలో భారత్ ప్రమేయం ఉందంటూ ఆరోపణలు

ది హేగ్‌: అంతర్జాతీయ న్యాయస్థానం వేదికగా పాకిస్థాన్‌ దుశ్చర్యకు పాల్పడింది. పెషావర్‌ ఉగ్రదాడిలో భారత్‌ ప్రమేయం ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసు విచారణ సందర్భంగా పాక్‌ ఈ వ్యాఖ్యలు చేసింది.

పాక్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసుకు సంబంధించి అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) సోమవారం నుంచి విచారణ ప్రారంభించింది. నేడు పాకిస్థాన్‌ కౌన్సిల్‌ తన వాదనలు వినిపించింది. ‘పాకిస్థాన్‌ను తక్కువ చేసి చూపించేందుకే భారత్‌ ఈ పిటిషన్‌ వేసింది. 2014లో పెషావర్‌లోని సైనిక పాఠశాలలో ఉగ్రదాడి జరిగి 140 మంది చిన్నారులను మేం కోల్పోయాం. ఈ దాడికి భారత్‌ స్పాన్సర్‌ చేసింది. ఇప్పుడు కుల్‌భూషణ్‌ జాదవ్‌తో బలూచిస్థాన్‌లో దాడులు చేయాలని భారత ప్రభుత్వం ప్రయత్నించింది. జాదవ్‌ రా అధికారి. విచారణలో ఈ విషయాన్ని జాదవ్‌ స్వయంగా ఒప్పుకొన్నాడు. ఆత్మాహుతి దాడులు జరిపి పాక్‌లో గందరగోళం సృష్టించేందుకు జాదవ్‌ అనేక మందిని కలిశాడు. అజిత్ ఢోబాల్‌ మార్గ నిర్దేశకత్వంలోనే జాదవ్‌ ఈ పనులన్నీ చేశాడు. జాదవ్‌ను ఇరాన్‌ నుంచి కిడ్నాప్‌ చేశామని భారత్‌ చెప్పడం హాస్యాస్పదం. భారత్‌ నిజాన్ని దాచాలని చూస్తోంది’ అని పాకిస్థాన్‌ కౌన్సిల్‌ ఆరోపించింది.

జాదవ్‌ నేరస్థుడే అయినప్పటికీ మానవతా దృక్పథంతో అతడి కుటుంబాన్ని కలిసేందుకు తాము అనుమతినిచ్చామని పాక్‌ పేర్కొంది. ఇలా భారత్‌ ఎప్పుడైనా ఓ పాక్‌ ఖైదీని కలిసేందుకు అనుమతి ఇచ్చిందా అని ప్రశ్నించింది.

కేసును వాయిదా వేసేందుకు ఐసీజే నిరాకరణ
ఈ కేసులో సోమవారం వాదనలు జరుగుతుండగా పాక్‌ తరఫున తాత్కాలిక న్యాయమూర్తిగా ఉన్న హుస్సేన్‌ గిలానీకి గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. దీంతో నేడు వాదనలు ప్రారంభించిన పాక్‌.. వేరే న్యాయమూర్తిని నియమించేంత వరకు విచారణ వాయిదా వేయమని కోరింది. అయితే ఇందుకు ఐసీజే ఒప్పుకోలేదు. అందుబాటులో ఉన్న న్యాయమూర్తులతోనే వాదనలను కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించింది.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.