
తాజా వార్తలు
ది హండ్రెడ్ క్రికెట్ లీగ్‌లో పాల్గొనే అవకాశం వస్తే!
ముంబయి: వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లో ఆరంభమయ్యే ‘ది హండ్రెడ్ క్రికెట్ లీగ్’కు టీమిండియా సీనియర్ ఆటగాడు హర్భజన్‌సింగ్ పేరు డ్రాఫ్ట్ పద్ధతిలో తెరపైకి రావడంతో అతడి రిటైర్మెంట్పై వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ ఆడుతున్న భజ్జీ 2020లో నిర్వహించే హండ్రెడ్ లీగ్‌లో ఆడేందుకు తన కనీస ధరను 100,000 పౌండ్లుగా నిర్ణయించాడు. కాగా భారత క్రికెటర్లు ఐపీఎల్ మినహా ఇతర దేశాల్లోని ఏ లీగ్‌లో పాల్గొనడానికి వీలులేని కారణంగా అక్టోబర్ 20న హండ్రెడ్ లీగ్‌కు ఎంపికయ్యేవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోబోడని తెలుస్తోంది. ఒకవేళ అతడు ఈటోర్నీకి ఎంపికైతే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం లేకపోలేదు.
ఇదిలా ఉండగా భారత్ తరఫున 2016 ఆసియాకప్‌లో చివరిసారి ఆడిన భజ్జీ తర్వాత అవకాశాలు రాకపోయినా ఇప్పటివరకూ రిటైర్మెంట్ ప్రకటించలేదు. టీమిండియా తరఫున అత్యధికంగా టెస్టుల్లో 417 వికెట్లు తీసిన భజ్జీ వన్డేల్లో 260 వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా నిలిచాడు. మరోవైపు ఐపీఎల్లో 150 వికెట్లతో తన సత్తా చాటాడు ఈ సీనియర్ ఆఫ్‌స్పిన్నర్. మరోవైపు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ఇటీవల గ్లోబల్ కెనడా టీ20 లీగ్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే.
’ది హండ్రెడ్’ అనేది వంద బంతుల క్రికెట్ లీగ్. ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ఈ టోర్నీని నిర్వహిస్తోంది. 2020 జులైలో ఈ టోర్నీ తొలి సీజన్ ఆరంభంకానుంది. ఈ లీగ్‌లో మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు పాల్గొంటుండగా, ప్రతీ జట్టుకు ముగ్గురు మాత్రమే విదేశీ ఆటగాళ్లను అనుమతించారు. ఈ నేపథ్యంలో భజ్జీ ఈ టోర్నీకి ఎంపికౌతాడా లేదా అనేది తేలాల్సి ఉంది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఉతికి ఆరేశారు
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- దిశకు తల్లిదండ్రులతో సఖ్యత లేదేమో!
- రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్
- అసలు కాల్పులు అక్కడే జరిగాయా?
- టీమిండియా సమష్టి విజయం
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- రూ.200 పెట్టి ఫస్ట్‌షో చూడండి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
