close

తాజా వార్తలు

నోటీస్‌బోర్డు

ప్రవేశాలు
సీపీజీఈటీ - 2019

తెలంగాణ రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీల్లో 2019 - 20 విద్యా సంవత్సరానికిగానూ పీజీ కోర్సుల ఉమ్మడి ప్రవేశపరీక్షకు ప్రకటన విడుదలైంది. ఈ పరీక్ష తెలంగాణ ఉన్నత విద్యామండలి తరఫున ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తోంది.
కోర్సులు: పీజీ, పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాములు.
విభాగాలు: ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం, ఎంబీఏ.
ప్రవేశాలు కల్పించే యూనివర్సిటీలు: ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ.
అర్హత: ఇంటర్మీడియట్‌, బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. చివరి ఏడాది పరీక్షలు రాసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
పరీక్ష తేదీ: జూన్‌ 14
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేది: 30.05.2019 (అపరాధ రుసుం రూ. 2000తో 11.06.2019 వరకు)
http://tscpget.com/

ఐసీఎస్‌ఐ, నవీ ముంబయి

నవీ ముంబయిలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎస్‌ఐ) కింది కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు- కాలవ్యవధి: ఇంటిగ్రేటెడ్‌ కంపెనీ సెక్రటరీ- 3 ఏళ్లు మొత్తం సీట్లు: 50
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, ఐసీఎస్‌ఐ/ ఐసీఏఐ(సీపీటీ)/ ఐసీఎంఏఐ ప్రవేశపరీక్ష అర్హత సాధించి ఉండాలి.
వయసు: 26 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ప్రవేశపరీక్ష ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
చివరితేది: మే 10
వెబ్‌సైట్‌: https://www.icsi.edu/ccgrt/integratedncsncoursenfullntime/

వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ
సెంట్రల్‌ సాల్ట్‌ అండ్‌ మెరైన్‌ కెమికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌

న్యూదిల్లీలోని సీఎస్‌ఐఆర్‌ - సెంట్రల్‌ సాల్ట్‌ అండ్‌ మెరైన్‌ కెమికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీఎస్‌ఎంసీఆర్‌ఐ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
పోస్టులు- ఖాళీలు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-ఖి: 03, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-ఖిఖి:04, రిసెర్చ్‌ అసోసియేట్‌:02
ఒప్పంద కాలవ్యవధి: 2020 మార్చి 31 వరకు.
అర్హతలు: సంబంధిత విభాగాల్లో బీఎస్సీ/ ఎంఎస్సీ/ ఎంటెక్‌/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
ఎంపిక: రాతపరీక్ష, స్క్రీనింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.
వాక్‌ఇన్‌ తేది: మే 20
వేదిక: సెంట్రల్‌ సాల్ట్‌ అండ్‌ మెరైన్‌ కెమికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, జీబీ మార్గ్‌, భవ్‌నగర్‌,న్యూదిల్లీ-364002.
https://www.csmcri.org/index.php

ప్రభుత్వ ఉద్యోగాలు
అగ్రికల్చరల్‌ ఎకనామిక్స్‌ రిసెర్చ్‌ సెంటర్‌, దిల్లీ

యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీలోని అగ్రికల్చరల్‌ ఎకనామిక్స్‌ రిసెర్చ్‌ సెంటర్‌ తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు-ఖాళీలు: రిసెర్చ్‌ ఇన్వెస్టిగేటర్స్‌:03, రిసెర్చ్‌ ఫెలో:02
అర్హత: సంబంధిత విభాగాల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: మే 17 నాటికి 35 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌
చివరితేది: మే 17
చిరునామా: అగ్రికల్చర్‌ ఎకనామిక్స్‌ రిసెర్చ్‌ సెంటర్‌, యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీ, దిల్లీ-110007.
http://www.du.ac.in/du/

Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.