
తాజా వార్తలు
ఇంటర్నెట్ డెస్క్ : యువ ఆల్‌రౌండర్ విజయ్‌శంకర్ ఆటతీరుపై భారత మాజీ క్రికెటర్ సంజయ్మంజ్రేకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్, అస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో మొదటి రెండు మ్యాచుల్లో సునాయాసంగా గెలిచిన భారత్.. మిగిలిన మూడు వన్డేల్లో అనూహ్యంగా ఓటమిపాలైంది. దీంతో సిరీస్ కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ప్రపంచకప్ అతి సమీపంలో ఉన్న తరుణంలో ఇలా వరుస వైఫల్యాలు క్రికెట్ అభిమానులను కలవరపెడుతున్నాయి. భారత జట్టు ఓటమిపై సంజయ్ మంజ్రేకర్ ట్విటర్ వేదికగా స్పందించారు. మంచి అవకాశాలు సద్వినియోగం చేసుకోకుండా.. కీలకమైన సమయంలో యువఆటగాళ్లు విఫలమయ్యారన్నారు. ముఖ్యంగా ఆల్‌రౌండర్ విజయ్‌శంకర్ ఆటపై అసంతృప్తి వెళ్లగక్కారు. సిరీస్ మొదట్లో అందరి ప్రశంసలు పొందిన శంకర్ కీలకమైన మ్యాచుల్లో సరిగా ఆడలేదన్నారు. దిల్లీ వన్డేలో సందర్భాన్ని బట్టి ఆచితూచి ఆడాల్సి ఉండగా.. తొందరపడి అనవసరంగా భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడని విశ్లేషించాడు. రిషభ్‌పంత్ కూడా కీలకమైన మ్యాచుల్లో విఫలమయ్యాడని అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మీ ఆటతీరు అందోళనకు గురి చేస్తోంది. విజయ్‌శంకర్, రిషభ్‌పంత్ వచ్చిన ఎంతో మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు.. స్ట్రైక్ రొటేట్ చేస్తూ.. సరైన సమయంలో భారీ షాట్లు ఆడటం కోహ్లీని చూసి నేర్చుకోవాల’ని వాళ్లకు సూచించారు. మిడిల్ ఆర్డర్లో ఆటగాళ్లు ఇలా విఫలమైతే ఇది కచ్చితంగా ప్రపంచకప్ అవకాశాలను దెబ్బ తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. సిరీస్ విజయం సాధించిన ఆస్ట్రేలియాకు శుభాకాంక్షలు తెలిపారు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- ఆ సంగతి తర్వాత చూద్దాం: రోహిత్
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- మంత్రివర్గంలో వారికి చోటిస్తాం: యడియూరప్ప
- సంజు శాంసన్ కోసం శశి థరూర్ ఆవేదన
- కోహ్లీ×విలియమ్స్: గెలుపెవరిదో చూడాలి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
