close

తాజా వార్తలు

రోహిత్‌శర్మ అత్యద్భుతమైన బ్యాట్స్‌మన్‌

కోహ్లీ ఒకప్పుడు ఆల్‌రౌండర్‌: కేన్‌ విలియమ్సన్‌ 

మాంచెస్టర్‌: ప్రపంచకప్ టోర్నీలో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ అత్యద్భుతంగా ఆడుతున్నాడని.. అందులో ఎలాంటి సందేహం లేదని న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ ప్రశంసించాడు. సోమవారం మ్యాచ్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో విలయమ్సన్‌ మాట్లాడాడు. ఇప్పటివరకూ ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో హిట్‌మ్యాన్‌ ఐదు శతకాలు, ఒక అర్ధశతకంతో మొత్తం 647 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో రోహిత్‌ను విలియమ్సన్‌ కొనియాడాడు.

ఇదిలా ఉండగా 2008లో అండర్‌ 19 ప్రపంచకప్‌ సెమీస్‌ ఫైనల్లో కోహ్లీసేనతో తలపడిన సందర్భాన్నీ విలియమ్సన్‌ గుర్తుచేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లీ తన వికెట్‌ తీయడంపై విలియమ్సన్‌ వివరణ ఇస్తూ.. ‘కోహ్లీ అప్పుడు ఆల్‌రౌండర్‌గా ఉండేవాడు, ఇప్పుడు అలా బౌలింగ్‌ చేయడంలేదు’ అంటూ నవ్వులు పూయించాడు. ఆ స్థితి నుంచి ఇలా జాతీయ జట్టుకు నాయకత్వం వహించడం వరకూ ఎదగడం గొప్పగా ఉందని చెప్పాడు. 

ఇక టీమిండియాతో జరగబోయే మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేయాల్సి ఉందని కివీస్‌ కెప్టెన్‌ పేర్కొన్నాడు. ఇప్పటివరకూ టోర్నమెంట్‌లో న్యూజిలాండ్‌ బౌలర్ల ప్రదర్శన బాగుందని, తమ బౌలర్లు పరిస్థితులను త్వరగా అర్థం చేసుకొని రాణిస్తున్నారని చెప్పాడు. అలాగే టీమిండియా బౌలింగ్‌ సామర్థ్యం కూడా అద్భుతంగా ఉందని, కోహ్లీసేన సమతూకంతో ఆకట్టుకుంటోందని తెలిపాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.