
తాజా వార్తలు
కోల్‌కతా: భారత్‌లో తొలి డే నైట్ టెస్ట్‌కు టీమిండియా కఠోర సాధన చేస్తోంది. సాయం సంధ్యవేళ గులాబీ బంతితో కోహ్లీసేన కసరత్తులు చేస్తున్నప్పటి వీడియోను బీసీసీఐ ట్విటర్లో పంచుకుంది. బౌలర్లు గులాబీరంగు బంతితో సిద్ధంగా ఉన్న ఫొటోలను షేర్ చేసింది. పింక్ బాల్‌ను ఎదుర్కోవడం చాలా వరకు ఆటగాళ్లకు కొత్త. అందుకే చీకటి పడుతున్న సమయంలో వారితో ఎక్కువ సాధన చేయిస్తున్నారు. ఈడెన్‌లో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో షమీ బంతులు విసరగా విరాట్ వాటిని ఆడేందుకు ప్రయత్నం చేశాడు. మరోవైపు తొలి టెస్టులో డబుల్ సెంచరీ వీరుడు మయాంక్ కూడా నెట్స్‌లో సాధన చేస్తున్నాడు.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం భారత్‌లో తొలి డేనైట్ టెస్ట్ మొదలు కానుంది. ఈ మ్యాచ్ కోసం భారత క్రికెటర్లతో పాటు అభిమానులు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈడెన్ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సొంతగడ్డ కావడంతో ఏర్పాట్లు కూడా ఘనంగా జరుగుతున్నాయి. ఈ టెస్ట్‌కు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా అతిథులుగా హాజరుకానున్నారు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- ఘోర అగ్ని ప్రమాదం..43 మంది మృతి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- కొడితే.. సిరీస్ పడాలి
- పెళ్లే సర్వం, స్వర్గం
- ‘శరద్ పవార్ కొన్ని విషయాలు దాచారు’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
