close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బస్సుల బంద్‌

తెలంగాణ ఆర్టీసీ ఐకాస చేపట్టిన సమ్మె వరుసగా తొమ్మిదో రోజూ కొనసాగుతోంది. ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యకు యత్నించడంతో ఖమ్మం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేడు బస్సుల బంద్‌కు ఆర్టీసీ ఐకాస పిలుపునిచ్చింది. ఉదయం నుంచే బస్టాండ్‌ల ఎదుట ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఖమ్మం, మణుగూరు తదితర ఆరు డిపోల్లోని అన్ని రకాల బస్సుల బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. పనులిస్తాం.. వచ్చేయండి

గల్ఫ్‌ దేశాలలోని తెలంగాణ వలస కార్మికులు స్వరాష్ట్రానికి తిరిగి రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు. కుటుంబ పోషణకు వెళ్లిన వారిలో కొందరు పనులు చేస్తున్నారని, మరికొందరు పనులు దొరక్క ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అక్కడి తెలంగాణ వాసుల స్థితిగతులు, అవస్థలపై ముఖ్యమంత్రి శనివారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తమ ప్రభుత్వం ఇక్కడే ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని, స్వరాష్ట్రానికి తిరిగి రావాలని ఆయన కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. అప్పుల కుప్ప!

ఆంధ్రప్రదేశ్‌పై ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.16,206.95 కోట్ల రుణభారం పడింది. బడ్జెట్‌ పరిధిలోకి రాని అప్పులను ఇందులో లెక్కలోకి తీసుకోలేదు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.31వేల కోట్లకు పైగా అప్పుచేయాల్సి ఉంటుందని అంచనాల్లో పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి రాష్ట్ర అప్పులు రూ.2,91,345 కోట్లకు చేరతాయని అంచనా. అయితే తొలి ఆరునెలల్లోనే అప్పుల వాటా అంచనాల్లో సగం దాటింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. 9,648 వాలంటీర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన

ఎంపికయినా చేరని, వివిధ కారణాలతో భర్తీ కాని 9,648 గ్రామ వాలంటీర్ల నియామకం కోసం ప్రభుత్వం మరోసారి ప్రకటన జారీ చేయనుంది. ఈ మేరకు జిల్లాల వారీగా ఖాళీల వివరాలను అధికారులు ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. గ్రామాల్లో యాభై కుటుంబాలకో వాలంటీర్‌ చొప్పున 1,94,592 మంది నియామకాలు చేపట్టింది. వారిలో 1,84,944 మంది విధుల్లో చేరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. హోంగార్డుల దినసరి వేతనం పెంపు

హోంగార్డుల దినసరి వేతనాన్ని ఏపీ ప్రభుత్వం పెంచింది. ఇప్పటివరకు రోజుకు వారికి రూ.600 చొప్పున చెల్లిస్తున్నారు. దీన్ని రూ.710కి పెంచుతూ హోంశాఖ కార్యదర్శి కేఆర్‌ఎం కిశోర్‌కుమార్‌ శనివారం ఉత్తర్వులిచ్చారు. ఈ పెంపు అక్టోబరు1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. విచిత్ర వేషం.. వినోద భరిత 

7. గంగాప్రక్షాళన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతా: పవన్‌

గంగా ప్రక్షాళన ఉద్యమాన్ని దక్షిణాదిన విస్తృతంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తెలిపారు. గంగానది ఉత్తరాదికి మాత్రమే పరిమితం కాదని, దేశం నలుమూలల్లో నీటిని గంగ అని పిలవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. శనివారం హరిద్వార్‌లోని మాత్రి ఆశ్రమంలో గంగా కాలుష్యంపై జరిగిన మేధావుల సదస్సులో పవన్‌ మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. స.హ.దరఖాస్తుల అవసరాన్ని తగ్గిస్తాం

సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దరఖాస్తు చేయాల్సిన ఆవశ్యకతను తగ్గించేలా వీలైనంత ఎక్కువ సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తెలిపారు. ఎక్కువ సంఖ్యలో ఆర్టీఐ దరఖాస్తులు వస్తుంటే అది ప్రభుత్వ విజయం కాబోదని పేర్కొన్నారు. శనివారం కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) 14వ వార్షిక సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. భారత్‌లో పెరిగిపోతున్న కోటీశ్వరులు

భారత్‌లో కోటీశ్వరుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 2018-19 అసెస్‌మెంట్‌ సంవత్సరంలో రూ.కోటికి పైగా ఆదాయం ఉన్న వారి సంఖ్య  97,689కు చేరింది. ఈ విషయాన్ని ఆదాయపన్ను శాఖ వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయంలో వీరి సంఖ్య 81,344 మాత్రమే ఉంది. ఏడాదిలో దాదాపు 20శాతం వృద్ధిని సాధించింది.  వీరిలో 49,128 మంది వేతన జీవుల ఆదాయం రూ. కోటి దాటింది. అదే గత ఏడాది వీరి సంఖ్య 41,457 మాత్రమే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. గుజరాత్‌ తీరంలో పాక్‌ పడవలు

జమ్ముకశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్‌ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నాటి నుంచి భారత్‌కు ఉగ్రముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో గుజరాత్‌లోని భారత్‌-పాక్‌ సరిహద్దుకు సమీపంలో గల హరామి నాలా క్రీక్‌ ప్రాంతంలో పాకిస్థాన్‌కు చెందిన ఐదు చేపల పడవలను గుర్తించిన సరిహద్దు భద్రతా సిబ్బంది(బీఎస్ఎఫ్‌) వాటిని స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.