close

తాజా వార్తలు

వెండినగలతో వెలిగిపోదాం!

ఇప్పుడంతా ఆక్సిడైజ్డ్‌ సిల్వర్‌ నగలదే హవా. నచ్చింది ఎంచుకోవడం కన్నా... దుస్తులకు  తగినట్లుగా మ్యాచ్‌ చేసుకుంటే ఆ నిండుదనమే వేరు. ఏ దుస్తులకు ఎలాంటి నగలు బాగుంటాయో తెలుసుకుందాం.
* చిరుగుల జీన్స్‌, ట్యాంక్‌ టాప్‌ వేసుకుంటున్నారా... వీటిమీదకు హ్యాంగింగ్స్‌ పెట్టి చూడండి. కాలేజీ అమ్మాయిలకు ఇవి చక్కగా నప్పుతాయి.  
* స్పగెట్టీ డ్రెస్‌ ఎంచుకుంటుంటే... జతగా ఆక్సిడైజ్డ్‌ సిల్వర్‌ నెక్లెస్‌, కాళ్లకు ఎత్తు మడమల చెప్పులు చాలు.
* జెగ్గింగ్‌లు, ఫ్లేర్డ్‌ ప్యాంట్లపై చిన్నచిన్న రింగులు, ఓ చంకీ బ్రాస్‌లెట్‌ ప్రయత్నించండి.
* ఆఫీసుకు డెనిమ్‌ చొక్కా వేసుకుంటే... మ్యాచింగ్‌గా చోకర్‌ ఒకటి పెట్టుకోండి చాలు.
* తెలుపురంగు టాప్‌, ప్యాంటుమీదకు లేయర్డ్‌ నెక్లెస్‌ అదిరిపోతుంది.

* దేశీలుక్‌లో కుర్తా- పటియాలా, జ్యూతీ వంటివి వేసుకుంటుంటే జుంకాలు, చాంద్‌బాలీలు సరైన ఎంపిక.
* సంప్రదాయ సల్వార్‌కమీజ్‌, చుడీదార్‌ వంటివాటిమీదకు చేతులనిండుగా వెండి కడా లేదా గాజులు బాగుంటాయి.  
* చీరకట్టుతో చక్కగా కనిపించాలంటే...నిండుగా నగలు ఉండాలి. ఇలాంటప్పుడు టెంపుల్‌ డిజైన్‌ హారం అదిరిపోతుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.