News in pics : చిత్రం చెప్పే విశేషాలు (05-05-2024)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Updated : 05 May 2024 04:25 IST
1/8
హైదరాబాద్‌: ఇనుపవ్యర్థాలతో తీర్చిదిద్దిన ఎద్దుల బండి.. జీవకళ ఉట్టిపడేలా వివిధ శిల్పాలు మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో కనువిందు చేస్తున్నాయి. విజయవాడకు చెందిన శిల్పి శ్రీహర్ష త్రీడి సాంకేతికతతో మలిచిన ఈ బొమ్మల ప్రదర్శనను శనివారం సాయంత్రం సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.

2/8
హైదరాబాద్‌: విజయవాడకు చెందిన 26 మంది చిత్రకారులు గీసిన అందమైన చిత్తరువులు శనివారం  మాదాపూర్‌లోని స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో కొలువుదీరాయి. ఈ ప్రదర్శన  13 వరకు కొనసాగనుంది.

3/8
హైదరాబాద్‌: రంగురంగుల లైట్లతో కళ్లు జిగేల్‌మనేలా కనిపిస్తున్న ఈ ద్విచక్ర వాహనం ట్యాంక్‌బండ్‌పై ‘ఈనాడు’ కెమెరాకు చిక్కింది.ఎక్కడికెళ్లినా అందరూ ఆసక్తిగా చూస్తున్నారని, యువత సెల్ఫీలు దిగుతారని, పిల్లలు చుట్టూ చేరి లైట్ల బండి వచ్చిందంటూ మురిసిపోతున్నారని సలీమ్‌ తెలిపారు.

4/8
తమిళనాడు: ఈసీఆర్‌ రోడ్డులోని ‘తమిళనాడు టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌’ ఆధ్వర్యంలో నడుస్తున్న ముట్టుక్కాడులో పర్యాటకులను ఆకర్షించేందుకు సరికొత్త డబుల్‌ డెక్కర్‌ ఫ్లోటింగ్‌ రెస్టారెంట్(నీటిలో తేలియాడే) అందుబాటులోకి రానుంది. 125 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పు ఉన్న ఈ పడవను కొచ్చిన్‌కు చెందిన ‘గ్రాండ్యుయర్‌ మెరైన్‌ ఇంటర్నేషనల్‌’, తమిళనాడు టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ సంస్థలు రూ.5 కోట్లతో సిద్ధం చేశాయి. రెస్టారెంట్ ఏసీతో కూడుకుని ఉంటుంది.

5/8
తమిళనాడు: చెన్నై మహానగరంలోని జెమినీ స్టూడియో (జెమినీ కూడలి) సమీపంలోని అన్నా పైవంతెన కింద ప్రజాపనుల శాఖ ఆధ్వర్యంలో సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. వంతెన కింద అక్కడక్కడా కూర్చునేందుకు వీలుగా బెంచీలు, రకరకాల పూల మొక్కలు పచ్చదనంతో కూడిన దృశ్యాలు అటుగా వెళ్లేవారిని అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

6/8
తమిళనాడు: పొన్నేరి సమీప తిరు ఆయర్పాడిలోని కరికాలచోళుడి కాలంనాటి కరికృష్ణ పెరుమాళ్‌ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్‌ 23 ప్రారంభమయ్యాయి. అనంతరం పురవీధుల్లో ఊరేగించారు. ఈవో కార్తిగేయన్‌, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పరిమళం, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

7/8
నల్గొండ: రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.దీంతో పక్షులు సేదతీరేందుకు ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నాయి. భూదాన్‌పోచంపల్లి మండలం కప్రాయపల్లిలో బాతులు కాలువలో సేదతీరుతూ కనిపించాయి. వందలాది బాతులు కాలువ నిండా ఉండటంతో అటుగా వెళ్లే వారికి కనుల విందుగా కనిపించాయి.

8/8
కర్నూలు నగరం 19వ వార్డు పరిధిలోని గణేశ్‌ నగర్‌లో జనం తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులకోసారి వచ్చే నగరపాలక సంస్థ నీటి ట్యాంకరు కోసం పనులు మానుకుని నిరీక్షిస్తున్నట్లు కాలనీవాసులు వాపోతున్నారు. తాగునీటి కొరత ఏర్పడినా మేయర్‌ ఏమాత్రం పట్టించుకోవడం లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

మరిన్ని