నాపై పోటీ చేసి గెలవండి... కేసీఆర్‌, హరీశ్‌రావుకు ఈటల సవాల్‌

తాజా వార్తలు

Updated : 08/08/2021 19:37 IST

నాపై పోటీ చేసి గెలవండి... కేసీఆర్‌, హరీశ్‌రావుకు ఈటల సవాల్‌

కరీంనగర్‌: త్వరలో జరగనున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ధైర్యముంటే తనపై పోటీ చేసి గెలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావుకు భాజపా నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ సవాల్‌ విసిరారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం చెల్పూరులో ఆయన పర్యటించారు. ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన పలువురు భాజపాలో చేరగా ఆయన పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ‘‘ నన్ను దిక్కులేని వాడని అనుకుంటున్నారు. నేను హజూరాబాద్‌ ప్రజల గుండెల్లో చోటున్న బిడ్డను. దళిత బంధు ద్వారా రూ.10లక్షలు ఇచ్చినా తెరాస గెలవదు. గొర్రెలిచ్చినా, కులాలవారీ తాయిలాలిచ్చినా తెరాసకు ప్రజలు ఓట్లు వేయరు. నన్ను ఓడించేందుకు రూ.5వేల కోట్లయినా ఖర్చు చేస్తారట. ఉరుములు వచ్చినా, పిడుగులు పడ్డా నా గెలుపును ఆపలేరు. నన్ను కాపాడుకుంటారా.. చంపుకుంటారా.. మీ ఇష్టం. ఓట్ల మీద తప్ప ఎస్సీలపై కేసీఆర్‌కు ప్రేమ లేదు. తెరాస ఏమిచ్చినా తీసుకోండి.. భాజపాకే ఓటేయండి’’ అని ఈటల రాజేందర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని