TS Assembly: తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం

తాజా వార్తలు

Updated : 24/09/2021 11:34 IST

TS Assembly: తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల మృతిచెందిన మాజీ శాసనసభ్యుల సంతాప తీర్మానాన్ని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. దివంగత మాజీ ఎమ్మెల్యేలు కుంజా బుజ్జి, అజ్మీరా చందూలాల్‌, కేతిరి సాయిరెడ్డి, కుంజా భిక్షం, మేనేని సత్యనారాయణరావు, మాచర్ల జగన్నాథం, రాజ్యయ్యగారి ముత్యంరెడ్డి, బొగ్గారపు సీతారామయ్య, చేకూరి కాశయ్య మృతికి శాసనసభ సంతాపం తెలిపింది. సంతాప తీర్మానాల అనంతరం శాసనసభ వాయిదా పడింది. సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. మరోవైపు శాసనమండలిలో ప్రొటెం స్పీకర్‌ హోదాలో భూపాల్‌ రెడ్డి సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. అనంతరం మండలి కూడా సోమవారానికి వాయిదా పడింది. సమావేశాల ప్రారంభం సందర్భంగా అసెంబ్లీ వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.

బడ్జెట్‌ సమావేశాల తర్వాత ఆరు నెలలకు అసెంబ్లీ కొలువుదీరింది. దళితబంధు వంటి సరికొత్త పథకాలను సభ ముందుంచడానికి ప్రభుత్వం సిద్ధమవుతుండగా.. గతంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి తదితర హామీల అమలు గురించి నిలదీయడానికి ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. ఈటల రాజేందర్‌ను మంత్రిపదవి నుంచి తొలగింపు, ఆయన రాజీనామా నేపథ్యంలో జరగనున్న ఉప ఎన్నికల అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. ఈసారి కూడా కరోనా నిబంధనలను పాటిస్తూనే సమావేశాలు నిర్వహిస్తున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని