కోహ్లి ఆదేశించాకే బ్యాట్‌ ఎత్తా : ఇషాన్‌

తాజా వార్తలు

Published : 16/03/2021 07:47 IST

కోహ్లి ఆదేశించాకే బ్యాట్‌ ఎత్తా : ఇషాన్‌

అహ్మదాబాద్‌: అరంగేట్ర టీ20లోనే అర్ధశతకంతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు 22 ఏళ్ల ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌. ఇంగ్లాండ్‌తో రెండో టీ20తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన అతను ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో సత్తాచాటిన సంగతి తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌లో రషీద్‌ బౌలింగ్‌లో వరుసగా రెండో సిక్సర్‌ కొట్టి అర్ధశతకాన్ని చేరుకున్న తర్వాత సంబరాలు చేసుకునేందుకు అతను వెంటనే బ్యాట్‌ ఎత్తలేదు. అందుకు కారణమేంటో స్పిన్నర్‌ చాహల్‌ తనను ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా బయటపెట్టాడు. ‘‘నిజం చెప్పాలంటే మ్యాచ్‌లో అర్ధశతకం చేరుకున్నానని అప్పుడు నాకు తెలియదు. గొప్ప ఇన్నింగ్స్‌ ఆడావని కోహ్లి నాతో అన్న తర్వాతే నాకు అర్థమైంది. కానీ అర్ధసెంచరీ తర్వాత నాకు బ్యాట్‌ ఎత్తే అలవాటు లేదు. కానీ అప్పుడు కోహ్లి.. ‘బ్యాట్‌ ఎత్తి మైదానంలోని నలువైపులకు చూపెట్టు. ఇది నీ తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ కాబట్టి అందరికీ బ్యాట్‌ను చూపించు’ అని వెనకాల నుంచి అరిచాడు. ఆ తర్వాతే బ్యాట్‌ ఎత్తి అభివాదం చేశా. ఎందుకంటే అది కెప్టెన్‌ ఆదేశంగా భావించా. అలాంటి ఆటగాడితో కలిసి బ్యాటింగ్‌ చేయడం కొత్త అనుభూతినిచ్చింది. అతని స్థాయిని అందుకోవడానికి మొదట్లో ఇబ్బంది పడ్డా. అత్యున్నత స్థాయిలో రాణించాలంటే ఎలాంటి శరీర భాష ఉండాలో అర్థం చేసుకున్నా’’ అని ఇషాన్‌ వెల్లడించాడు.
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని