పంత్‌ గాడిలో పడినట్టేనా..?
close

తాజా వార్తలు

Updated : 15/02/2021 07:17 IST

పంత్‌ గాడిలో పడినట్టేనా..?

చెన్నై: బ్యాట్స్‌మన్‌గా పంత్‌ నిలకడగా రాణిస్తున్నప్పటికీ.. వికెట్‌ కీపర్‌గా మాత్రం అతని ప్రదర్శన అంతంతమాత్రమే. ఆస్ట్రేలియాలో సిరీస్‌లో బ్యాట్‌తో గొప్పగా ఆడి టీమ్‌ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించిన అతను వికెట్ల వెనకాల ఎంతటి పేలవ ప్రదర్శన చేశాడో తెలిసిందే. సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులోనూ బ్యాట్‌తో మెరిసిన అతను.. వికెట్‌ కీపర్‌గా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో రెండో టెస్టులో స్పిన్‌కు బాగా సహకరిస్తున్న పిచ్‌పై వికెట్ల వెనకాల పంత్‌ ఎలాంటి ప్రదర్శన చేస్తాడోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత అందరూ అతని బ్యాటింగ్‌తోపాటు వికెట్‌ కీపింగ్‌ను మెచ్చుకుంటున్నారు. అనూహ్యంగా తిరుగుతున్న బంతిని చక్కగా ఒడిసిపట్టడంతో పాటు రెండు అద్భుత క్యాచ్‌లు అందుకున్న అతను.. జట్టు ఆధిపత్యం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 

మొదట అతడు పోప్‌ క్యాచ్‌ను అందుకున్నాడు. క్రీజులో కుదురుకున్న పోప్‌.. సిరాజ్‌ బౌలింగ్‌లో లెగ్‌సైడ్‌ బంతిని ఆడాడు. బ్యాట్‌ను ముద్దాడుతూ వెళ్లిన ఆ బంతిని తన ఎడమవైపు డైవ్‌ చేస్తూ ఒంటిచేత్తో బంతిని అందుకున్నాడు పంత్‌. అది చేజారింది. కానీ నేలకు తాకే లోపు మరోసారి బంతిని ఒడిసిపట్టుకున్నాడు. ఇషాంత్‌ బౌలింగ్‌లో లీచ్‌ క్యాచ్‌ను కూడా అదే తరహాలో డైవ్‌ చేసి వేలి కొనలతో బంతిని పట్టుకోవడం విశేషం. బ్యాట్స్‌మన్‌గా రాణిస్తున్న పంత్‌.. వికెట్‌కీపర్‌గానూ ఇదే ప్రదర్శన కొనసాగిస్తే జట్టుకు ఇబ్బంది ఉండదు. మరోవైపు కోహ్లి, రహానె కూడా చురుకైన క్యాచ్‌లతో జట్టు ఫీల్డింగ్‌ బలాన్ని చాటారు. 
ఇవీ చదవండి..
అశ్విన్‌ రికార్డుల పరంపర
ఒకే ఓవర్‌లో అర్జున్‌ తెందుల్కర్‌ 5 సిక్సర్లు
పంత్ నువ్వు కామెంటరా? వికెట్‌కీపరా?


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని