close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
టీ20 ప్రపంచకప్‌ కష్టమే

 

మెల్‌బోర్న్‌: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌ షెడ్యూలు ప్రకారం అక్టోబరు-నవంబరులో జరిగే అవకాశాలు కనిపించట్లేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మార్క్‌ టేలర్‌ అన్నాడు. ఆ సమయంలో ఐపీఎల్‌ జరిగితే ఆసీస్‌ బోర్డు తమ ఆటగాళ్లను ఆ టోర్నీలో ఆడేందుకు అనుమతించే అవకాశముందని చెప్పాడు. ‘‘ముందస్తు షెడ్యూలు ప్రకారం అక్టోబరు-నవంబరులో టీ20 ప్రపంచకప్‌ జరగకపోవచ్చని అనుకుంటున్నా. దీనిపై ఈ వారమే నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అప్పుడు అందరూ ప్రణాళికలు రచించుకుంటారు’’ అని టేలర్‌ అన్నాడు. ఈ నెల 28న జరిగే ఐసీసీ బోర్డు సమావేశంలో టీ20 ప్రపంచకప్‌ నిర్వహణ సహా అనేక అంశాలపై చర్చించనున్నారు. అయితే టీ20 ప్రపంచకప్‌పై ఆగస్టు వరకు ఎలాంటి నిర్ణయం రాకపోవచ్చని క్రికెట్‌ ఆస్ట్రేలియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కెవిన్‌ రాబర్ట్స్‌ చెప్పాడు. ఈ టోర్నీలో అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు ఆస్ట్రేలియాలో జరగాల్సివుంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.