
ప్రధానాంశాలు
మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
ఇంటర్నెట్‌డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ నెట్టింట్లో చురుకుగా ఉంటాడన్న విషయం తెలిసిందే. మైదానంలో దూకుడుగా పరుగులు సాధించినట్లే సామాజిక మాధ్యమాల్లోనూ అదే వైఖరి కొనసాగిస్తుంటాడు. పరిస్థితులకు తగ్గట్లుగా సద్విమర్శలతో సరదాగా పోస్ట్‌లు చేస్తుంటాడు. తాజాగా వీరూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది.
గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో భారత్ చారిత్రక విజయం సాధించిన సంగతి తెలిసిందే. విజయంలో యువ క్రికెటర్లు రిషభ్ పంత్, శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ కీలక పాత్ర పోషించారు. అయితే శుభ్‌మన్ గిల్ తండ్రి లఖ్విందర్ గిల్, వాషింగ్టన్ సుందర్ తండ్రి ఎం.సుందర్.. వాళ్ల కుమారుల ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. శతకం సాధించలేకపోయారని నిరాశ పడ్డారు.
జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సుందర్ 62 పరుగులు చేశాడు. శార్దూల్‌తో కలిసి శతక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక గిల్ రెండో ఇన్నింగ్స్‌లో 91 పరుగులు బాదాడు. సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆదిలోనే వెనుదిరిగినా పుజారా సహకారంతో లక్ష్యాన్ని కరిగించాడు. ఈ ఇన్నింగ్స్‌లపై దిగ్గజ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు.
అయినా లఖ్విందర్, ఎం.సుందర్ మూడంకెల స్కోరుపైనే ఎక్కువ మక్కువ చూపడంతో.. వారిద్దరిని ఉద్దేశిస్తూ సెహ్వాగ్ సరదాగా ఓ పోస్ట్ చేశాడు. ‘‘తల్లిదండ్రులు..ఎప్పటికీ తల్లిదండ్రులే’’ అని వ్యంగ్యంగా దానికి వ్యాఖ్య జత చేశాడు. దీనికి టీమిండియా క్రికెటర్లు శిఖర్ ధావన్, యుజువేంద్ర చాహల్ లైక్ కొట్టగా, యువరాజ్ సింగ్ నవ్వుతున్న ఎమోజీలను కామెంట్ చేశాడు.
ఇదీ చదవండి
ఆస్ట్రేలియన్ నోట ‘భారత్ మాతా కీ జై’
ప్రపంచమంతా సెల్యూట్ చేస్తోంది: రవిశాస్త్రి
భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
ప్రధానాంశాలు
సినిమా
- ఏంటీ ఇవన్నీ రీమేక్‌లా..!
- నాపై నాకే చిరాకేసింది: బెన్‌స్టోక్స్
- అర్ధరాత్రి ఆకలేస్తోందా...
- పెళ్లి కుదిరాక నిరాకరించాడని!
- రివ్యూ: ఏ1 ఎక్స్‌ప్రెస్
- నెలకు రూ.8వేలు రావాలంటే...
- క్యాస్టింగ్ కౌచ్‌ని ఎదిరించి.. సినిమాల్లో రాణించి..!
- ప్రభాస్‌తో ఫరియా.. పాయల్ తెలుగు.. శ్రీముఖి సెల్ఫీ
- మనసుకు నచ్చినవాడిని మనువాడి...
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
