Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 173898
            [news_title_telugu_html] => 

వినోద్‌ నియామక ఉత్తర్వులపై సంతకం చేసిన సీఎస్‌

[news_title_telugu] => వినోద్‌ నియామక ఉత్తర్వులపై సంతకం చేసిన సీఎస్‌ [news_title_english] => [news_short_description] => మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా నియమించే ఉత్తర్వులపై సీఎస్‌ ఎస్‌కే జోషి శుక్రవారం సచివాలయంలోని డి-బ్లాక్‌లో సంతకం చేశారు. సీఎం కేసీఆర్‌ వినోద్‌ [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
వినోద్‌ నియామక ఉత్తర్వులపై సంతకం చేసిన సీఎస్‌ - EENADU
close
వినోద్‌ నియామక ఉత్తర్వులపై సంతకం చేసిన సీఎస్‌

ఈనాడు, హైదరాబాద్‌: మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా నియమించే ఉత్తర్వులపై సీఎస్‌ ఎస్‌కే జోషి శుక్రవారం సచివాలయంలోని డి-బ్లాక్‌లో సంతకం చేశారు. సీఎం కేసీఆర్‌ వినోద్‌ నియామకానికి నిర్ణయం తీసుకోగా.. ఈసమాచారాన్ని సీఎం కార్యాలయ అధికారులు సీఎస్‌కు తెలియజేశారు. వెంటనే ఉత్తర్వులివ్వాలని కోరారు. ఆ సమయానికి కంచన్‌బాగ్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఉన్న సీఎస్‌ అక్కడి నుంచి సచివాలయానికి వచ్చారు. సి-బ్లాక్‌లో ఉన్న ఆయన కార్యాలయాన్ని బూర్గుల రామకృష్ణారావు భవన్‌కు తరలించారు. అక్కడ పేషీ మరమ్మతులు సాగుతున్నాయి. దీంతో సీఎస్‌ సచివాలయానికి వచ్చి డి-బ్లాక్‌లో కూర్చున్నారు. సాధారణ పరిపాలనశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అధర్‌సిన్హా... వినోద్‌ నియామక ఉత్తర్వుల ముసాయిదా ప్రతిని తీసుకొని వచ్చారు. సీఎస్‌ దానిపై సంతకం చేయడంతో వెంటనే అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.