Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177083
            [news_title_telugu_html] => 

28న భవిష్యనిధి ఉద్యోగుల దేశ వ్యాప్త సమ్మె

[news_title_telugu] => 28న భవిష్యనిధి ఉద్యోగుల దేశ వ్యాప్త సమ్మె [news_title_english] => [news_short_description] => భవిష్యనిధి ఉద్యోగుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కనీస స్పందన కరవైందని ఈపీఎఫ్‌ ఉద్యోగుల సమాఖ్య జాతీయ నేతలు పేర్కొన్నారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ బుధవారం హైదరాబాద్‌ బర్కత్‌పురలోని ప్రాంతీయ భవిష్యనిధి కార్యాలయంలో  ఉద్యోగులు [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
28న భవిష్యనిధి ఉద్యోగుల దేశ వ్యాప్త సమ్మె - EENADU
close
28న భవిష్యనిధి ఉద్యోగుల దేశ వ్యాప్త సమ్మె

ఉద్యోగ సంఘాల జాతీయ నేతల వెల్లడి

బర్కత్‌పుర, న్యూస్‌టుడే: భవిష్యనిధి ఉద్యోగుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కనీస స్పందన కరవైందని ఈపీఎఫ్‌ ఉద్యోగుల సమాఖ్య జాతీయ నేతలు పేర్కొన్నారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ బుధవారం హైదరాబాద్‌ బర్కత్‌పురలోని ప్రాంతీయ భవిష్యనిధి కార్యాలయంలో  ఉద్యోగులు నినాదాలు చేసి నిరసన తెలిపారు. అనంతరం ఈపీఎఫ్‌ ఉద్యోగుల సమాఖ్య జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి డి.గోపాల్‌గౌడ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి కృపాకరణ్‌(చెన్నై), జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు మోహన్‌కుమార్‌ ఉపాధ్యాయ (పట్నా), జాతీయ ఉపాధ్యక్షుడు బి.సతీశ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుందరశివరావు తదితరులు మాట్లాడారు. భవిష్యనిధి ఉద్యోగుల డిమాండ్లపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఈ నెల మొదటి వారం నుంచి దశల వారీగా ఆందోళనలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 28న దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నట్లు చెప్పారు. గ్రూపు-బి, సి, డి కేడర్లకు సంబంధించిన అన్ని నియామక నిబంధనలను తక్షణమే ఆమోదించాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న పని నిబంధనలను పునఃసమీక్షించాలని, అంతర్‌రాష్ట్ర బదిలీలను శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలని, ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. డిమాండ్లు సాధించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.