Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 179690
            [news_title_telugu_html] => 

15 బ్లాకుల్లో సున్నపురాయి నిక్షేపాలు

[news_title_telugu] => 15 బ్లాకుల్లో సున్నపురాయి నిక్షేపాలు [news_title_english] => [news_short_description] => తెలంగాణలో కొత్తగా మూడు జిల్లాల్లోని 15 బ్లాకుల్లో సిమెంట్‌ గ్రేడ్‌ సున్నపురాయి నిక్షేపాలను గుర్తించారు. సూర్యాపేట, నల్గొండ, వికారాబాద్‌ జిల్లాల్లో 6 క్లస్టర్లలోని 15 బ్లాకుల్లో తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ) నిర్వహించిన సర్వేలో ఈ నిక్షేపాలు వెలుగులోకి వచ్చాయి. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఇప్పటికే [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
15 బ్లాకుల్లో సున్నపురాయి నిక్షేపాలు - EENADU
close
15 బ్లాకుల్లో సున్నపురాయి నిక్షేపాలు

ఈనాడు,హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా మూడు జిల్లాల్లోని 15 బ్లాకుల్లో సిమెంట్‌ గ్రేడ్‌ సున్నపురాయి నిక్షేపాలను గుర్తించారు. సూర్యాపేట, నల్గొండ, వికారాబాద్‌ జిల్లాల్లో 6 క్లస్టర్లలోని 15 బ్లాకుల్లో తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ) నిర్వహించిన సర్వేలో ఈ నిక్షేపాలు వెలుగులోకి వచ్చాయి. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఇప్పటికే పలుసున్నపురాయి గనులను సిమెంట్‌ కంపెనీలకు లీజుపద్ధతిలో కేటాయించారు. మరిన్ని నిక్షేపాలను అన్వేషించేందుకు 6 క్లస్టర్ల పరిధిలో 300 చ.కి.మీ.ప్రాంతాన్ని టీఎస్‌ఎండీసీకి అప్పగించారు. నేషనల్‌ మినరల్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ ట్రస్ట్‌ (ఎన్‌ఎంఈటీ) నిధులతో ఖనిజాభివృద్ధి సంస్థ ఈ క్లస్టర్లలో జీ-4 సర్వే నిర్వహించింది. 30 చోట్ల 50 మీటర్ల లోతు వరకు బోర్లు తవ్వి నమూనాలుసేకరించింది. వీటి రసాయన విశ్లేషణ ద్వారా అక్కడ సిమెంట్‌ గ్రేడ్‌ సున్నపురాయి ఉన్నట్లు గుర్తించారు. దీనిపై కేంద్రానికి నివేదిక పంపనున్నారు. జీ-4 ఫలితాలను ఎన్‌ఎంఈటీకి పంపిన టీఎస్‌ఎండీసీ త్వరలో జీ-2 సర్వే చేయాలని నిర్ణయించింది. ఈ సర్వేలో సున్నపురాయి పరిమాణం, నాణ్యతపై స్పష్టత రానుంది.

సర్వే చేసిన బ్లాకులు
సూర్యాపేట జిల్లా: మేళ్లచెరువు, మల్లారెడ్డిగూడెం, యేపల మాధవరం, మఠంపల్లి 1,2 బ్లాకులు, రఘునాథపాలెం 1,2బ్లాకులు, రామాపురం, దొండపాడు, కొత్తగూడెం
నల్గొండ జిల్లా: వాజిగూడెం, వీరప్పగూడెం
వికారాబాద్‌ జిల్లా: జివాంగి 1,2 బ్లాకులు, మల్కాపూర్‌

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.