పలువురు డీఎస్పీల బదిలీ

ప్రధానాంశాలు

పలువురు డీఎస్పీల బదిలీ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పలువురు డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్‌ కమిషనరేట్‌ (అటాచ్డ్‌)లో ఉన్న టి.శ్రీనివాసరావును కరీంనగర్‌(టౌన్‌) ఏసీపీగా, పరకాల ఏసీపీ పి.శ్రీనివాస్‌ను కాజీపేట ఏసీపీగా, హైదరాబాద్‌ కమిషనరేట్‌(అటాచ్డ్‌)గా ఉన్న జూపల్లి శివరామయ్యను పరకాల ఏసీపీగా, జి.వెంకటరమణగౌడ్‌ను హెచ్‌ఎండీఏ డీఎస్పీగా నియమించారు. కాజీపేట ఏసీపీ బి.రవీంద్రకుమార్‌, హెచ్‌ఎండీఏ డీఎస్పీ జగన్‌లను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని