Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 219009402
            [news_title_telugu_html] => 

17న హైదరాబాద్‌లో భాజపా బహిరంగ సభ

[news_title_telugu] => 17న హైదరాబాద్‌లో భాజపా బహిరంగ సభ [news_title_english] => [news_short_description] => తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు.... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,24,23, ) )
17న హైదరాబాద్‌లో భాజపా బహిరంగ సభ - EENADU
close
17న హైదరాబాద్‌లో భాజపా బహిరంగ సభ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు చేపట్టిన భాజపా.. సెప్టెంబరు 17న బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది. నిజామాబాద్‌, కరీంనగర్‌లలో ఒకచోట ఈ సభ ఏర్పాటు చేయాలని కమలదళం భావిస్తూ వచ్చింది. తాజాగా హైదరాబాద్‌లో పెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఆ సభకు భాజపా జాతీయ అధ్యక్షుడిని రప్పించడం ద్వారా తెలంగాణ విమోచన దినోత్సవం విషయంలో మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని కమలనాథులు భావించారు. ఆ సభకు అమిత్‌షా రానున్నారని పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే వెల్లడించింది. పర్యటన ఖరారు కోసం రాష్ట్ర నాయకత్వం ఒకట్రెండు రోజులుగా ప్రయత్నాలు చేసింది. తాజా సమాచారం ప్రకారం అమిత్‌షా ఈ నెల 17న తెలంగాణ పర్యటనకు వచ్చే అవకాశాలు దాదాపుగా లేవని తెలిసింది. ఇది ఖరారైతే జాతీయస్థాయి నేతను గానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి ఓ ప్రజాప్రతినిధిని గానీ రప్పించాలని భావిస్తోంది.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.