Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 219009410
            [news_title_telugu_html] => 

బోరుమన్న రామన్న

[news_title_telugu] => బోరుమన్న రామన్న [news_title_english] => [news_short_description] => మంత్రి పదవి రాలేదని అలకబూనిన ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న మూడురోజుల అజ్ఞాతాన్ని వీడారు. బుధవారం ఆదిలాబాద్‌లోని తన ఇంటికి చేరుకున్నారు. సోమవారం ఉదయం గన్‌మెన్లను వదలి వెళ్లిపోయిన రామన్న ఆచూకీ తెలియకపోవడంతో పార్టీ శ్రేణులు, కుటుంబీకుల్లో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే బుధవారం వచ్చిన విషయం తెలిసి భారీ ఎత్తున కార్యకర్తలు ఆదిలాబాద్‌లోని ఆయన స్వగృహానికి తరలి వచ్చారు. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,24,23, ) )
బోరుమన్న రామన్న - EENADU
close
బోరుమన్న రామన్న

అజ్ఞాతం వీడిన ఎమ్మెల్యే
భావోద్వేగానికి గురై కంటతడి

ఆదిలాబాద్‌ పట్టణం, న్యూస్‌టుడే: మంత్రి పదవి రాలేదని అలకబూనిన ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న మూడురోజుల అజ్ఞాతాన్ని వీడారు. బుధవారం ఆదిలాబాద్‌లోని తన ఇంటికి చేరుకున్నారు. సోమవారం ఉదయం గన్‌మెన్లను వదలి వెళ్లిపోయిన రామన్న ఆచూకీ తెలియకపోవడంతో పార్టీ శ్రేణులు, కుటుంబీకుల్లో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే బుధవారం వచ్చిన విషయం తెలిసి భారీ ఎత్తున కార్యకర్తలు ఆదిలాబాద్‌లోని ఆయన స్వగృహానికి తరలి వచ్చారు. జోగు రామన్నకు మంత్రి పదవి ఎందుకివ్వడం లేదని నినాదాలు చేస్తూ ఎమ్మెల్యే అభిమాని వాఘ్మారే ప్రశాంత్‌ ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయగా కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జోగు రామన్న ఇంటి బయట రహదారిపైనే విలేకరులతో మాట్లాడారు. కార్యకర్తలెవరూ ఆత్మహత్యకు యత్నించవద్దని కోరారు. రక్తపోటు ఎక్కువ కావడంతోనే తాను ఎవరికీ చెప్పకుండా ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకున్నట్లు వివరించారు. పదవి రాకపోవడంతో కొంత మనస్తాపానికి గురైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా కొంత భావోద్వేగానికి గురై కంట తడిపెట్టారు. కేసీఆరే తమ నాయకుడని స్పష్టం చేశారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.