TSPSC: గ్రూప్‌-4 అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్: టీఎస్‌పీఎస్సీ

గ్రూప్-4 దరఖాస్తుల్లో తప్పులు సవరించుకునేందుకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) అవకాశం కల్పించింది.

Updated : 06 May 2023 18:06 IST

హైదరాబాద్‌: గ్రూప్-4 దరఖాస్తుల్లో తప్పులు సవరించుకునేందుకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఈనెల 9 నుంచి 15 వరకు ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది. దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునేందుకు మరోసారి అవకాశం ఉండదని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. మొత్తం 8,180 గ్రూప్‌-4 ఉద్యోగాల (TSPSC Group 4 jobs)కు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తీవ్రమైన పోటీ ఉన్న ఈ పరీక్ష జులై 1న జరగనుండగా.. అభ్యర్థులు అందుకనుగుణంగా ఇప్పటికే ప్రిపరేషన్‌ (Exam preparation) కొనసాగిస్తున్నారు. 

పీఈసెట్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు..

వ్యాయామ విద్య ప్రవేశ పరీక్ష (పీఈసెట్) దరఖాస్తుల గడువు పొడిగించింది. ఆలస్య రుసుము లేకుండా ఈనెల 16 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని