Telangana Jobs: ఎన్పీడీసీఎల్‌లో ఉద్యోగాలు.. వేతనం ఎంతో తెలుసా?

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. TSNPDCLలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది.  అర్హులైన అభ్యర్థులు ఈ నెల 10 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. పూర్తి వివరాలివే..

Updated : 10 Apr 2023 12:54 IST

హైదరాబాద్‌ః వరంగల్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(TSNPDCL)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను రెగ్యులర్‌ ప్రాతిపదికన నియామకాలకు ఏప్రిల్‌ 10 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. బీఏ/ బీఎస్సీ/ బీకాంలలో కంప్యూటర్స్‌ ఒక సబ్జెక్టుగా ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు. అదనంగా కంప్యూటర్‌ సర్టిఫికెట్‌ కోర్సులు ఏమీ అవసరంలేదు.

నోటిఫికేషన్‌లో ముఖ్యాంశాలివే.. 

  • అభ్యర్థుల వయస్సు: జనవరి 1, 2023 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.  ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు,  ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు మూడేళ్లు వరకు వయో సడలింపు.
  • వేతనం: నెలకు రూ.29,255 - రూ.54,380
  • దరఖాస్తు రుసుము: రూ.320 (ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు పరీక్ష రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది).
  • పరీక్ష కేంద్రాలు జీహెచ్‌ఎంసీ (హైదరాబాద్‌, జీడబ్ల్యూఎంసీ (వరంగల్‌) ప్రాంతాల పరిదిలో వేర్వేరు చోట్ల పరీక్ష కేంద్రాలు ఉంటాయి. 
  • ఎంపిక విధానం: రాత పరీక్ష(80 మార్కులు), సంబంధిత అనుభవం (20 మార్కులు), ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. 

ముఖ్యమైన తేదీలు..

  • దరఖాస్తుల సమర్పణ, ఫీజు చెల్లింపు: ఏప్రిల్‌ 10 నుంచి ప్రారంభం
  • దరఖాస్తులకు తుది గడువు: ఏప్రిల్‌ 29
  • దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణ: 02-05-2023 నుంచి 05-05-2023 వరకు.
  • హాల్ టికెట్ల డౌన్‌లోడ్‌: మే 25 నుంచి 
  • రాత పరీక్ష: మే 28న

ఆన్‌లైన్‌ దరఖాస్తులు/హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు సంబంధించి ఏవైనా సమస్యలు తలెత్తితే హెల్ప్‌ డెస్క్‌ 0870-2461030 నంబర్‌కు ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5గంటల వరకు సంప్రదించవచ్చు.

పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని