TSPSC: పాలిటెక్నిక్‌ లెక్చరర్స్‌ నియామక పరీక్షల తేదీల్లో మార్పులు: టీఎస్‌పీఎస్సీ

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) మే నెలలో నిర్వహించనున్న పాలిటెక్నిక్‌ లెక్చరర్స్‌ నియామక పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది.

Updated : 05 May 2023 22:24 IST

హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) మే నెలలో నిర్వహించనున్న పాలిటెక్నిక్‌ లెక్చరర్స్‌ నియామక పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నెల 13న జరగాల్సిన పాలిటెక్నిక్‌ లెక్చరర్స్‌ నియామక పరీక్షలను సెప్టెంబరు 4 నుంచి 8 వరకు రీషెడ్యూల్‌ చేసినట్లు కమిషన్‌ తెలిపింది. అలాగే ఈ నెల 17న ఇంటర్‌ విద్య, సాంకేతిక విద్యా శాఖల్లో ఫిజికల్‌ డైరెక్టర్ల నియామక పరీక్ష జరగాల్సి ఉంది. ఈ పరీక్షను సెప్టెంబర్‌ 11వ తేదీకి రీషెడ్యూల్‌ చేసినట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని