TS ICET 2023 Results: ఐసెట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. తొలి 10ర్యాంకులూ అబ్బాయిలవే..

TS ICET Results: తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఈ కింద లింక్‌పై క్లిక్‌ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.

Updated : 29 Jun 2023 17:46 IST

హన్మకొండ: తెలంగాణలోని పలు యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్‌ పరీక్ష ఫలితాలు(TS ICET Results) విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య లింబాద్రి, కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య టి.రమేశ్‌ వరంగల్‌లో విడుదల చేశారు. ఐసెట్‌లో 86.17శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. 61,092మంది అర్హత సాధించినట్టు అధికారులు వెల్లడించారు.

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

ఐసెట్‌లో తొలి 10 ర్యాంకుల్లోనూ అబ్బాయిలే సత్తా చాటారు. నూకల శరణ్‌కుమార్‌ మొదటి ర్యాంకు సాధించగా.. నాగులపల్లి సాయి నవీన్‌ రెండు, రవితేజ సజ్జ మూడో ర్యాంకులో మెరిశారు. టాప్ 10లో ఆ తర్వాతి ర్యాంకుల్లో ఎస్‌.సాయి ఫణి ధనుష్‌, గోపి మల్లికంటి, తిరుగుడు సుమంత్‌ కుమార్‌ రెడ్డి, ఆయాచితుల నితీశ్‌కుమార్‌, వి. సాయి వెంకట కార్తిక్‌, ఎస్‌.నాగసాయి కృష్ణవంశీ, బి.సాయిగణేష్‌ నిలిచారు. గత నెల 26, 27 తేదీల్లో నాలుగు సెషన్లలో నిర్వహించిన ICET పరీక్షకు దాదాపు 70,900 మందికి పైగా విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని