Postal GDS Results: పోస్టల్‌లో 40,889 జీడీఎస్‌ జాబ్స్‌.. షార్ట్‌లిస్ట్‌ అయినవారి ఐదో జాబితా ఇదే..

Indian postal Recruitment: తపాలా శాఖలో 40వేలకు పైగా ఉద్యోగాలకు సంబంధించి ఐదో జాబితా విడుదలైంది. అభ్యర్థులు ఈ కింది లింక్‌లపై క్లిక్‌ చేయడం ద్వారా చెక్‌ చేసుకోవచ్చు.

Updated : 29 Jun 2023 15:43 IST

దిల్లీ: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అన్ని పోస్టల్‌ సర్కిళ్లలో 40వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి షార్ట్‌లిస్ట్‌ అయినవారి ఐదో జాబితాను తపాలాశాఖ(Postal Department) విడుదల చేసింది. వీరంతా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్ల పరిధిలో గ్రామీణ డాక్‌ సేవక్‌(జీడీఎస్) నియామకాలు-2023కు సంబంధించి జనవరిలో మొత్తం 40,889 పోస్టులకు భారీ నోటిఫికేషన్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.  వీటిలో ఏపీ నుంచి 2,480 పోస్టులు; తెలంగాణలో 1,266 చొప్పున ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఐదో జాబితాకు ఏపీ నుంచి 219మంది; తెలంగాణ నుంచి 175మంది అభ్యర్థులు షార్ట్‌లిస్ట్‌ అయ్యారు. మరిన్ని వివరాలు https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కులు/ గ్రేడ్‌ మెరిట్‌తో పాటు కంప్యూటర్‌ జనరేటెడ్‌ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అనుసరించి అభ్యర్థులను ఎంపిక  చేశారు. ఎంపికైనవారికి సమాచారం ఎస్‌ఎంఎస్‌/ ఈ-మెయిల్‌/ పోస్టు ద్వారా అందుతుంది. ఎంపికైనవారు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ హోదాలతో పనిచేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు జులై 8లోగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది.

ఏపీ నుంచి షార్ట్‌లిస్ట్‌ అయినవారి ఐదో జాబితా ఇదే..

తెలంగాణ నుంచి షార్ట్‌లిస్ట్‌ అయినవారి ఐదో జాబితా ఇదే..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని