TGRDC CET 2024: రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీల్లో చేరతారా? దరఖాస్తు చేసుకోండి

తెలంగాణలోని బీసీ, సాంఘిక, గిరిజన సంక్షేమ డిగ్రీ రెసిడెన్షియల్‌ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఏప్రిల్‌ 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలివే..

Published : 15 Mar 2024 17:42 IST

TGRDC CET 2024 | ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలంగాణలో ఇంటర్‌ పూర్తి చేసి రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీల్లో చేరాలనుకొనేవారికి గుడ్‌న్యూస్‌. మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ బాలుర/బాలికల సంక్షేమ రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్‌కు ఉమ్మడి ప్రవేశ పరీక్ష (RDC CET-2024)నిర్వహించనున్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఏప్రిల్‌ 12 వరకు ఆన్‌లైన్‌ https://tsrdccet.cgg.gov.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్‌ 28న జరగనుంది. ఏప్రిల్‌ 21 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచనున్నారు.

  • రాష్ట్రంలోని పలుచోట్ల ఉన్న రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాలల్లో బీఎస్సీ, బీకాం, బీఏ, బీబీఏ, బీఎస్సీ- ఫ్యాషన్‌ టెక్నాలజీ, బీఎస్సీ (ఆనర్స్‌) డిజైన్‌, టెక్నాలజీ, బీఎస్సీ లైఫ్‌సైన్సెస్‌, బీకాం (కంప్యూటర్‌ అప్లికేషన్స్‌)తో పాటు పలు వైవిధ్యమైన కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

అర్హతలివే..

  • 2023-24లో ఇంటర్‌ పరీక్షల్లో 50శాతం మార్కులతో పాసై ఉండాలి. ఇంగ్లిష్‌లో 40శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5శాతం సడలింపు ఉంది.
  • విద్యార్థుల తల్లిదండ్రులు/సంరక్షకుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు;  పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించరాదు. 
  • తహసీల్దార్‌/ఎమ్మార్వో తాజాగా ఇచ్చిన ఆదాయ ధ్రువీకరణ పత్రం అడ్మిషన్‌ సమయంలో చూపించాల్సి ఉంటుంది. 
  • ఎంపిక ప్రక్రియ: ప్రవేశపరీక్షలో మెరిట్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీట్లు భర్తీ చేస్తారు.
  • పరీక్ష: RDC CET 2024 పరీక్ష 150 మార్కులకు రెండున్నర గంటల సమయం ఉంటుంది. ఇంటర్‌ సిలబస్‌ ఆధారంగానే పరీక్ష ఉంటుంది. 
  • ఇంగ్లిష్‌, తెలుగు భాషల్లో ఆబ్జెక్టివ్‌ రూపంలో ప్రశ్నలు అడుగుతారు. ఓఎంఆర్‌ సమాధాన పత్రంపై రాయాల్సి ఉంటుంది. 
  • తప్పుడు సమాధానాలకు నెగెటివ్‌ మార్కులు లేవు. దరఖాస్తు రుసుం రూ.200
  • బీసీ విద్యార్థులకు మెయింటినెన్స్‌ ఛార్జీలు రూ.1000 కాగా, కాషన్‌ డిపాజిట్‌ రూ.1000, దోస్త్‌ స్టూడెంట్‌ రిజిస్ట్రేషన్‌ కింద రూ.425 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు అడ్మిషన్‌/ఇతర ఫీజులు లేవు. రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీలు, కోర్సుల వివరాలు, సీట్ల సంఖ్య, రిజర్వేషన్లు తదితర సమాచారాన్ని కింది పీడీఎఫ్‌లో చూడొచ్చు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని