ap polycet results: ఏపీ పాలిసెట్‌ ఫలితాలు విడుదల

ఏపీ పాలిసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి ఈ ఫలితాలను విడుదల చేశారు.

Updated : 08 May 2024 12:45 IST

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

విజయవాడ: ఏపీ పాలిసెట్‌ ఫలితాలు (ap polycet 2024 results) విడుదలయ్యాయి. విజయవాడలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి బుధవారం ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్‌ 27న పాలిసెట్‌ నిర్వహించారు. మొత్తం 1.42లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా, 1.24లక్షల మంది అర్హత పొందారు. 87.61శాతం ఉత్తీర్ణత సాధించినట్లు సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. ఇందులో బాలికలు 89.81శాతం (50,710), బాలురు 86.16 శాతం(73,720) ఉత్తీర్ణత సాధించారు. ప్రవేశ పరీక్షలో పొందిన మొత్తం మార్కులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులకు ర్యాంకులు కేటాయించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలలు మొత్తం 267 ఉండగా, వాటిల్లో మొత్తం 82,870 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పాలిటెక్నిక్‌ కళాశాలల్లో అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ తేదీలకు సంబంధించిన ప్రకటనను త్వరలోనే విడుదల చేయనున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన తరగతులు జూన్‌ 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు