ICSE ISC Results: ఐసీఎస్‌ఈ 10, 12 ఫలితాలు విడుదల

ICSE ISC Results: ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ ఫలితాలను CISCE విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చు. 

Updated : 06 May 2024 12:48 IST

దిల్లీ: ఐసీఎస్‌ఈ (పదో తరగతి), ఐఎస్‌సీ (12వ తరగతి) ఫలితాలను ‘కౌన్సిల్‌ ఫర్‌ ది ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్స్ బోర్డు (CISCE)’ సోమవారం  విడుదల చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను results.cisce.org అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. కెరీర్స్‌ పోర్టల్‌, డిజిలాకర్‌లోనూ స్కోర్‌కార్డులు పొందొచ్చు. ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షల షెడ్యూల్‌ను సైతం బోర్డు విడుదల చేసింది. ఆ పరీక్షలు జులైలో జరగనున్నాయి. విద్యార్థులు తమ యూఐడీ, ఇండెక్స్‌ నంబర్‌లతో పాటు క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేసి ఫలితాలు పొందొచ్చు.

పదో తరగతిలో బాలికలు 99.65 శాతం, బాలురు 99.31 శాతం ఉత్తీర్ణత శాతం సాధించారు. 12వ తరగతిలో ఇవి వరుసగా 98.92 శాతం, 97.53 శాతంగా ఉన్నాయి. రెండింట్లోనూ బాలికలదే పైచేయి కావడం విశేషం. ఐసీఎస్‌ఈ పరీక్షలు మార్చి 28తో; ఐఎస్‌సీ పరీక్షలు ఏప్రిల్‌ 13తో ముగిసిన విషయం తెలిసిందే.

సీబీఎస్‌ఈ ఫలితాలు ఎప్పుడంటే?

లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12వ తరగతి పరీక్షలను మే 20 తర్వాతే వెల్లడించే అవకాశం ఉన్నట్లు బోర్డు అధికారులు ఇటీవల తెలిపారు. ఈ ఏడాది సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు; 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరిగాయి. దేశవ్యాప్తంగా దాదాపు 39 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని