Intermediate exam fee: TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు

ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు గడువును తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు పొడిగించింది. మే 4 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది.

Published : 02 May 2024 19:53 IST

హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు గడువును తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు పొడిగించింది. వాస్తవానికి నేటితో ఈ గడువు ముగియగా.. విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాళాలల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గడువును మే 4 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. అన్ని జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపల్స్‌ కూడా టీఎస్‌బీఐఈ ఖాతాకు అదే తేదీలోగా ఫీజులు చెల్లించాలని సూచించింది. తెలంగాణలో మే 24 నుంచి జూన్‌ 3వ తేదీ వరకు ఇంటర్ అడ్వాన్డ్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 12 వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని