TSPSC: మరో అయిదు పరీక్షలకు కొత్త తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ

మరో అయిదు ఉద్యోగ నియామక పరీక్షలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(TSPSC)వాయిదా వేస్తూ కొత్త తేదీలను ప్రకటించింది.

Updated : 15 Apr 2023 20:26 IST

హైదరాబాద్‌: మరో అయిదు ఉద్యోగ నియామక పరీక్షలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(TSPSC)వాయిదా వేస్తూ కొత్త తేదీలను ప్రకటించింది. ఈనెల, వచ్చేనెలలో జరగాల్సిన అయిదు పరీక్షలను వాయిదా వేసిన టీఎస్‌పీఎస్సీ.. కొత్త తేదీలను ప్రకటించింది. ఈనెల 23న జరగాల్సిన అసిస్టెంట్‌ మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ నియామక పరీక్షను జూన్‌ 28కి వాయిదా వేసింది. ఈనెల 25న జరగాల్సిన అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ నియామక పరీక్ష మే 16న నిర్వహించనున్నట్టు కమిషన్‌ వెల్లడించింది.

ఈనెల 26, 27న జరగాల్సిన భూగర్భ జలశాఖలో గెజిటెడ్‌ పోస్టుల పరీక్షలు జులై 18, 19న నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. మే 7న జరగాల్సిన డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ నియామక పరీక్ష మే 19కి వాయిదా పడింది. మే 15, 16న జరగాల్సిన భూగర్భ జలశాఖలో నాన్‌గెజిటెడ్‌ పోస్టుల పరీక్ష జులై 20, 21న నిర్వహించనున్నట్టు కమిషన్‌ తెలిపింది. ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా ఇప్పటికే  కొన్ని పరీక్షలను రద్దు చేయగా... మరి కొన్నింటిని వాయిదా వేసింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు