చవక రక్త పరీక్షతోనే అల్జీమర్స్‌ గుర్తింపు

ప్రస్తుతం అందుబాటులో ఉన్న రక్తపరీక్షతోనే అల్జీమర్స్‌ సంకేతాలను గుర్తిస్తే? అదీ సూదితో తీసే వెన్ను ద్రవం పరీక్షతో సమానంగా ఫలితం చూపిస్తే? ఇది సాధ్యమేనని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది.

Published : 30 Jan 2024 01:22 IST

ప్రస్తుతం అందుబాటులో ఉన్న రక్తపరీక్షతోనే అల్జీమర్స్‌ సంకేతాలను గుర్తిస్తే? అదీ సూదితో తీసే వెన్ను ద్రవం పరీక్షతో సమానంగా ఫలితం చూపిస్తే? ఇది సాధ్యమేనని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. రక్తంలో ఉన్న పి-టావ్‌217 ప్రోటీన్‌ను గుర్తించటం ఈ పరీక్ష ప్రత్యేకత. ప్రస్తుతం వెన్ను ద్రవాన్ని తీసి దానిలోని ప్రొటీన్ల ఆనవాళ్ల సాయంతో అల్జీమర్స్‌ను గుర్తిస్తున్నారు. అధునాతన పెట్‌ స్కాన్‌ కూడా నిర్ధరణకు వాడుతున్నారు. ఇవి ఖరీదైనవి, అంతగా అందుబాటులో లేనివి కావటం వల్ల కొందరికి ఈ పరీక్షలు చేయటం కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో చవకైన, తేలికైన రక్త పరీక్ష కొత్త ఆశలు రేపుతోంది. అల్జీమర్స్‌ జబ్బు సూచికలైన అమీలాయిడ్‌ బీటా, టావు ప్రొటీన్ల మార్పులను పి-టావ్‌217 చాలావరకు సూచిస్తుండటం విశేషం. ఈ రక్త పరీక్ష 97% కచ్చితత్వంతో పనిచేస్తోందని తేలింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని