నన్ను ముట్టుకుంటే మంటే!
హాయ్ నేస్తాలూ...! ఎలా ఉన్నారు. ఏంటి అలా చూస్తున్నారు. నేను ఎవరనా? నేనో మొక్కను. మామూలు మొక్కను కాదు. నన్ను ముట్టుకుంటే మీకు మంటే. ఎందుకంటే నా ఆకుల్లో చాలా విషం ఉంటుంది. ప్రపంచంలోకెల్లా
హాయ్ నేస్తాలూ...! ఎలా ఉన్నారు. ఏంటి అలా చూస్తున్నారు. నేను ఎవరనా? నేనో మొక్కను. మామూలు మొక్కను కాదు. నన్ను ముట్టుకుంటే మీకు మంటే. ఎందుకంటే నా ఆకుల్లో చాలా విషం ఉంటుంది. ప్రపంచంలోకెల్లా అత్యంత విషపూరితమైన మొక్కల్లో నేనూ ఒకదాన్ని...
అన్నట్లు మీకు నా పేరు చెప్పానా?! లేదు కదా! అయినా అడగాలి కదా! సరే..సరే.. నేనే చెబుతానులే. నా పేరు ‘జిమ్పీ జిమ్పీ’! ఫన్నీగా ఉంది కదూ! కానీ నేను చాలా విషపూరితం. నా ఆకుల్ని ఎవరైనా ముట్టుకుంటే మాత్రం ఇక అంతే సంగతులు. భరించలేని మంట పుడుతుంది. కరెంట్ షాక్ కొట్టిందా అన్నట్లు అనిపిస్తుంది. చర్మం మీద ఎర్రని మచ్చలు వస్తాయి. వాపు కూడా ఉంటుంది. ఒకటి రెండు రోజుల వరకు తీవ్రమైన నొప్పిని భరించాల్సిందే.
ఆస్ట్రేలియా నా అడ్డా!
నా స్వస్థలం ఆస్ట్రేలియా. నన్ను జిమ్పీ.. జిమ్పీ అనే కాకుండా సూసైడ్ ప్లాంట్, డెండ్రోక్నైడ్ మొరోల్డ్స్, స్టింగ్‌బ్రష్, డెడ్లీస్టింగర్ అని కూడా పిలుస్తారు. హృదయం ఆకారంలో కనిపించే నా ఆకులకు చిన్న చిన్న ముళ్లలాంటి నిర్మాణాలుంటాయి. పరీక్షగా చూస్తేకానీ ఇవి కనిపించవు. అందుకే నా గురించి తెలియక నన్ను ముట్టుకుని చాలా మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నవాళ్లు ఉన్నారు. ఇంతా చేస్తే నాది మొక్కజాతి. నేను వృక్షంగా మారను.
అంతరించిపోతున్నా.
ప్చ్..! నాలో ఎంత విషం ఉండి ఏం లాభం. నేను అంతరించిపోతున్న మొక్కల జాబితాలో ఉన్నాను. ఈ మధ్య మా వాళ్ల సంఖ్య మరీ తగ్గిపోతోంది. మేం కేవలం ఆస్ట్రేలియాలో.. అదీ కొద్ది ప్రాంతానికే పరిమితమవడమూ దీనికి ఓ కారణమే!
పండ్లు తినొచ్చు..
మీకో విచిత్రమైన విషయం చెప్పనా.. నా ఆకుల్లో విషం ఉంటుంది కదా.. కానీ నా పండ్లను మాత్రం మీరు ఎంచక్కా తినొచ్చు. ఎందుకంటే అందులో విషమేమీ ఉండదు. పైగా చాలా రుచిగా ఉంటాయి. చూడ్డానికి కూడా గులాబీరంగులో నోరూరించేలా ఉంటాయి. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది జంతువుల నుంచి నన్ను రక్షించుకోవడానికే నేను ఆకుల్లో విషం దాచుకుంటా అని. ఫ్రెండ్స్.. ప్రస్తుతానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటామరి.మీరేమైనా నాకు షేక్‌హ్యాండ్ ఇవ్వాలనుకుంటున్నారా? పోనీ నా పండ్లు తింటారా...? హి..హి..హి.. ఓ.. వద్దన్నమాట. అయితే ఓకే..! బై.. బై..!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Revanth Reddy: మోదీ నోట.. చీకటి మిత్రుడి మాట: రేవంత్
-
Vivek Ramaswamy: వివేక్ పిల్లల.. ‘కేర్ టేకర్’ జీతం రూ.80లక్షలు..?
-
Arunachal Border: భారత సరిహద్దులో.. చైనా, పాకిస్థాన్‌ల సమావేశం!
-
Asian Games 2022: ఆసియా క్రీడలు.. అథ్లెటిక్స్‌లో భారత్‌కు పతకాల వర్షం
-
KTR: మోదీ యాక్టింగ్‌కు ఆస్కార్ ఖాయం: కేటీఆర్
-
Ram Charan: కొత్త ఫ్రెండ్‌ని పరిచయం చేసిన రామ్ చరణ్.. ఎవరంటే?