ఆకర్షణ.. ఆయుష్షు నాలుగు నెలలే!

వయసు అల్లరి చేస్తున్నప్పుడు.. మస్తిష్కంలో వలపు గోల చెలరేగినప్పుడు.. ఎవరైనా ఇష్టపడ్డ అమ్మాయి లేదా అబ్బాయిపై తీవ్ర మోహం కలుగుతుంది. అనుక్షణం వాళ్ల సమక్షంలోనే ఉండాలనే కోరిక పెరుగుతుంది.

Published : 18 Mar 2023 00:11 IST

యువ నాడి

యసు అల్లరి చేస్తున్నప్పుడు.. మస్తిష్కంలో వలపు గోల చెలరేగినప్పుడు.. ఎవరైనా ఇష్టపడ్డ అమ్మాయి లేదా అబ్బాయిపై తీవ్ర మోహం కలుగుతుంది. అనుక్షణం వాళ్ల సమక్షంలోనే ఉండాలనే కోరిక పెరుగుతుంది. చెలికాడితో మాట కలపాలనీ, ప్రియసఖితో సన్నిహితంగా మెలగాలనే ఉబలాటం ఎక్కువ అవుతుంది. యవ్వనంలో ఇది సహజమే అయినా ఈ ఆత్రం నాలుగు నెలలకు మించి ఉండదంటున్నాయి తాజా అధ్యయనాలు. ఈ భావోద్వేగాలు అంతకుమించి ఉంటే అది సీరియస్‌ ప్రేమగా రూపాంతరం చెందుతుందనీ.. లేదంటే ఆకర్షణ క్రమక్రమంగా తగ్గిపోతుందని సెలవిచ్చారు పరిశోధకులు. ఇష్టమైన వ్యక్తులు ఎదురుపడగానే మనసులో కల్లోలం చెలరేగడానికి కారణం మెదడులో ఉత్పత్తి అయ్యే డోపమైన్‌ అనే రసాయనం. అయితే రానురాను దీని తీవ్రత తగ్గుతుంటుంది. కొన్నాళ్లయ్యాక ఆ ఇద్దరూ బాధ్యతలు పంచుకోవడం.. ఒకరి బాగు మరొకరు కోరుకోవడం.. కష్టసుఖాలు పంచుకోవడంలాంటివి చేస్తున్నప్పుడు ఆకర్షణ కాస్తా.. శాశ్వత బంధంగా మారుతుంది. అది జరగలేదంటే.. అది ఉత్తినే అంటున్నారు. దీని వయసు నాలుగు నెలలు మించదంటున్నారు అధ్యయనకారులు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు