కలిసి చేస్తే.. కలదు ఫిట్‌నెస్‌..

జిమ్‌కెళ్తే.. కండలు పెరుగుతాయ్‌. కసరత్తులు చేస్తే ఫిట్‌నెస్‌ మెరుగవుతుంది. అందరికీ తెలిసిందే. అదే నలుగురితో కలిసి చేస్తే మరిన్ని లాభాలంటున్నారు నిపుణులు. ఎలాగంటే..

Published : 04 Feb 2023 00:38 IST

జిమ్‌కెళ్తే.. కండలు పెరుగుతాయ్‌. కసరత్తులు చేస్తే ఫిట్‌నెస్‌ మెరుగవుతుంది. అందరికీ తెలిసిందే. అదే నలుగురితో కలిసి చేస్తే మరిన్ని లాభాలంటున్నారు నిపుణులు. ఎలాగంటే..

* సంగీతం వింటూ కసరత్తులు చేయడం.. శిక్షకుడి సూచనలు అనుసరించడం.. నలుగురిని అనుసరిస్తూ వ్యాయామం చేయడంతో మన శరీరంలో సంతోష కారకాలైన ఎండార్ఫిన్లు, డోపమైన్‌ అధికంగా విడుదలవుతాయట. దీంతో రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుస్తుంది.
* ‘కోలర్‌ ఎఫెక్ట్‌’ ప్రకారం ఒక బృందంలో కలిసి పని చేసినప్పుడు, పోటీ పడినప్పుడు.. తమను తాము నిరూపించుకోవడానికి ఎవరైనా తీవ్రంగా శ్రమిస్తారు. ఇది వ్యాయామానికీ వర్తిస్తుంది. అదీగాక వర్కవుట్లు చేసేటప్పుడు ఒకరికొకరు సాయం చేసుకుంటూ మరింత మెరుగ్గా తయారవుతారు.
* ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరికివారే.. కింగ్‌. ఒంటరిగా కసరత్తులు చేసినప్పుడు ఎవరూ చూడటం లేదనే నిర్లిప్తత ఉంటుంది. కానీ నలుగురితో కలిసి చేస్తే జవాబుదారీతనం ఉంటుంది. శిక్షకుడు చెప్పినట్టు వినాలి. పక్కవాళ్ల సలహాలు పాటించాలి.
* బృంద వ్యాయామాలతో సమయమే తెలియదు. ఒకరితో ఒకరు చర్చించుకుంటారు. నవ్వులు వెల్లివిరుస్తాయి. గ్రూపులో ఒకరిద్దరి మనస్తత్వం నచ్చినా స్నేహం కుదురుతుంది. వాళ్ల కోసమైనా క్రమం తప్పకుండా వెళ్లాలనిపిస్తుంది. ఇది ఒకవైపు ఫిట్‌నెస్‌.. మరోవైపు ఒత్తిడి నుంచి ఉపశమనానికి మార్గం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని