మహీ కొత్త ఇన్నింగ్స్‌

ఎం.ఎస్‌.ధోనీ.. మైదానం లోపలున్నా.. వెలుపలున్నా.. యువతకు ఎప్పుడూ ఇష్టసఖుడే. క్రికెట్‌ జట్టుని ముందుండి నడిపించిన ఈ నాయకుడు ఇప్పుడు ‘డిజిటల్‌ లిటరసీ ప్రోగ్రాం’ ద్వారా సమాజాన్ని ఉద్ధరించే పనికి శ్రీకారం చుట్టాడు.

Published : 15 Oct 2022 01:06 IST

ఎం.ఎస్‌.ధోనీ.. మైదానం లోపలున్నా.. వెలుపలున్నా.. యువతకు ఎప్పుడూ ఇష్టసఖుడే. క్రికెట్‌ జట్టుని ముందుండి నడిపించిన ఈ నాయకుడు ఇప్పుడు ‘డిజిటల్‌ లిటరసీ ప్రోగ్రాం’ ద్వారా సమాజాన్ని ఉద్ధరించే పనికి శ్రీకారం చుట్టాడు.
అసలేంటీ కార్యక్రమం?: దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లోని వెయ్యిమంది ఉపాధ్యాయులకు ముందు డిజిటల్‌ బోధనపై శిక్షణనిస్తారు. తర్వాత ఒక ప్రత్యేకమైన కోర్సు ద్వారా లక్షమందికి పైగా విద్యార్థుల్ని డిజిటల్‌గా, సాంకేతికంగా నిష్ణాతులయ్యేలా తరగతులు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్‌ సంస్థ సహాయ, సహకారాలుంటాయి. కోర్సుని ఆ కంపెనీ అనుబంధ ‘టెక్‌ అవాంట్‌-గార్డె’ రూపకల్పన చేసింది. దీన్ని విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులు ఐటీ, టెక్నాలజీ, కార్పొరేట్‌, బ్యాంకింగ్‌, ఏఐ రంగాల్లో తేలికగా ఉద్యోగాలు సంపాదించగలిగేలా నైపుణ్యం పొందుతారు.

స్కూల్‌ గురించి: విద్యార్థులకు అత్యుత్తమ విద్య అందించే ఉద్దేశంతో ధోనీ బెంగళూరులో ‘ఎం.ఎస్‌.ధోనీ గ్లోబల్‌ స్కూల్‌’ని ప్రారంభించాడు. దీన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహిస్తున్నారు. ఈ స్కూల్‌కి ధోనీ మెంటర్‌గా వ్యవహరిస్తూ నిర్వహణ బాధ్యతలను కొందరు విద్యావేత్తలకు అప్పజెప్పాడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని