హెయిర్‌.. తీసుకో గురూ కేర్‌

ఎంత కష్టపడి సింగారించుకున్నా.. తలపై జుట్టు సరిగా ఉంటేనే అమ్మాయిలైనా, అబ్బాయిలైనా అందంగా కనిపిస్తారు.

Updated : 10 Dec 2022 00:47 IST

ఎంత కష్టపడి సింగారించుకున్నా.. తలపై జుట్టు సరిగా ఉంటేనే అమ్మాయిలైనా, అబ్బాయిలైనా అందంగా కనిపిస్తారు. అంతటి కీలకమైన హెయిర్‌ని చలికాలంలో ఎలా కాపాడుకోవాలంటే..

* టోపీ: దుమ్మూధూళీ, తేమ నుంచి రక్షణ కోసం టోపీ ధరించాలి. ఇది చలి నుంచి కాపాడుతుంది కూడా.

* హ్యుమిడిఫయర్‌: ఈ పరికరం ఇంట్లో ఉంటే.. ఒంటికి వెచ్చదనంతోపాటు చలితో జుత్తు నిర్జీవంగా తయారు కాదు.

* కత్తిరింపు: కుర్రాళ్లు నెలకోసారైనా జుత్తుని కత్తిరిస్తుంటే వెంట్రుకల చివర్లు ఆరోగ్యంగా ఉంటాయి.

* వేడి నీళ్లు: మరీ వేడి నీళ్లు, అతిగా స్టీమ్‌ షవర్‌తో స్నానం చేయడం జుట్టుకి మంచిది కాదు. గోరువెచ్చని నీళ్లు చాలు.

* నూనె: నిర్జీవంగా తయారైన జుట్టుకి హెయిర్‌ ఆయిల్‌ ప్రాణం తీసుకొస్తుంది. వారానికి రెండుసార్లైనా పట్టించాలి.

* వద్దు: రోజూ షాంపూతో స్నానం చేయడం, మాయిశ్చరైజర్లు వాడుతుంటే జుత్తు పలచబడుతుంది. అతిగా వద్దు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని