ర్యాగింగ్‌ వల.. చిక్కొద్దిలా!

నడిపించాల్సిన సీనియర్లే నరకం చూపిస్తున్నారు. అండగా నిలవాల్సిన మనసులే.. బాధతో ఉసురు తీసుకునేలా ప్రేరేపిస్తున్నారు.

Updated : 10 Dec 2022 00:38 IST

నడిపించాల్సిన సీనియర్లే నరకం చూపిస్తున్నారు. అండగా నిలవాల్సిన మనసులే.. బాధతో ఉసురు తీసుకునేలా ప్రేరేపిస్తున్నారు. హైదరాబాద్‌, ఆదిలాబాద్‌, అస్సాం, మధ్యప్రదేశ్‌, కేరళ.. ఈమధ్యకాలంలో వరుసగా ర్యాగింగ్‌ సంఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో జూనియర్లు ఎలా జాగ్రత్తపడాలంటే..

* సీనియర్ల సమక్షంలో ఆత్మవిశ్వాసంతో ఉండాలి. కనీసం నటించాలి. బెరుకుగా, భయంగా ఉంటే.. తేలికగా లక్ష్యం అవుతాం.
* జూనియర్లు జట్లుజట్లుగా ఉన్నప్పుడు సీనియర్లు మనల్ని టచ్‌ చేయడానికి వెనకాడతారు.

* సీనియర్లని గౌరవిస్తూ.. ‘అన్నా’, ‘అక్కా’ అంటూ సంబోధిస్తుంటే వాళ్ల ‘ఇగో’ సంతృప్తి చెందుతుంది. మరీ హీరోలా పోజు కొడుతూ.. ఢీ అంటే ఢీ అంటూ ముందుకెళ్తేనే తీవ్రంగా స్పందిస్తారు.

* సీనియర్లు అందరూ రాక్షసులేం కాదు. వాళ్లతోనూ స్నేహం పెంచుకుంటే.. సమయం వచ్చినప్పుడు మనల్ని కాపాడతారు.

* ఒక్కోసారి ఏడుపు సైతం మనల్ని ప్రమాదం నుంచి బయట పడేస్తుంది. వాళ్లు టీజింగ్‌ మొదలు పెట్టగానే ఏడుపు అందుకుంటే.. జాలి హృదయాలు కరిగి వదిలేయవచ్చు.

* ర్యాగింగ్‌కి గురయ్యేవాళ్లలో ఎక్కువమంది హాస్టళ్లలో ఉండేవాళ్లే. వీళ్లు వీలైతే కొద్దిరోజుల పాటు స్నేహితుల గదుల్లో, బయటి హాస్టళ్లలో ఉండటం ఉత్తమం.

* అతి తెలివితేటలు చూపించడం.. పోజు కొట్టడం.. సీనియర్లకు నచ్చవు. వాళ్ల సమక్షంలో ఓవర్‌ స్మార్ట్‌నెస్‌ తగ్గిస్తే మంచిది.

* ధైర్యమూ ఒక్కోసారి మనల్ని కాపాడుతుంది. వాళ్లు అడిగినవాటికి నిర్భయంగా సమాధానాలు చెప్పడం.. ర్యాగింగ్‌ చేయాలని ప్రయత్నిస్తే.. ‘తప్పు చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తా’నని హెచ్చరించడం ఆపదల నుంచి గట్టెక్కిస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని