జోకింగ్‌లు మనవాళ్లే

టాటార్గెట్లతో కుస్తీలు.. బాస్‌తో చీవాట్లే కాదు.. మన ఉద్యోగుల జోకులూ రోజూ బాగానే పేలుతున్నాయట. ఇందులో  దక్షిణాది యువోద్యోగులు ముందున్నారు.

Published : 18 Feb 2023 00:18 IST

యువనాడి

టాటార్గెట్లతో కుస్తీలు.. బాస్‌తో చీవాట్లే కాదు.. మన ఉద్యోగుల జోకులూ రోజూ బాగానే పేలుతున్నాయట. ఇందులో  దక్షిణాది యువోద్యోగులు ముందున్నారు. లింక్డ్‌ఇన్‌ సంస్థ చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

* సగం మంది దక్షిణభారత ఉద్యోగులు సహోద్యోగుల్ని నవ్వించేలా కబుర్లు చెబుతున్నారు. 38శాతం, 37శాతం, 36శాతం వాటాలతో పశ్చిమ, తూర్పు, ఉత్తర భారత ఉద్యోగులు తర్వాత స్థానాల్లో ఉన్నారు.  
* మొత్తమ్మీద ఇక్కడ ప్రతి ఐదుగురు ఉద్యోగుల్లో ఇద్దరు రోజుకో జోక్‌ అయినా వేసి కొలీగ్స్‌ని నవ్వుల్లో ముంచెత్తుతున్నారు.

* పని చేసే చోట సరదాగా ఉండేవాళ్లలో ఇటాలియన్లది ప్రపంచంలోనే మొదటిస్థానం. తర్వాత వరుసలో ఉన్నది మనవాళ్లే.

* జోక్‌ వేయడం భావోద్వేగాలను ప్రదర్శించడంలో ఒక భాగం. నలుగురితో కలిసి పని చేసినప్పుడు ఆటోమేటిగ్గా కలుపుగోలుతనం పెరుగుతుందట.

*నోరు విప్పకుండా, పక్కవాళ్లతో మాట కలపకుండా పని చేసుకునేవాళ్లలో ఆస్ట్రేలియా, జర్మనీ, నెదర్లాండ్స్‌, ఫ్రాన్స్‌ ఉద్యోగులు ముందున్నారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని