జంటలకు ప్రత్యేకం..

ఈ ప్రేమికుల దినోత్సవాన ప్రేమను పంచడానికి.. ప్రేమను పెంచడానికి.. ప్రేమికులకు ఓ భారీ ఆఫర్‌ సిద్ధం చేసింది ముంబయిలోని కేఫ్‌ 49.

Updated : 10 Feb 2024 00:26 IST

ప్రేమికుల దినోత్సవాన ప్రేమను పంచడానికి.. ప్రేమను పెంచడానికి.. ప్రేమికులకు ఓ భారీ ఆఫర్‌ సిద్ధం చేసింది ముంబయిలోని కేఫ్‌ 49. ఎలాంటి లాభాపేక్ష లేకుండా తమ కెఫే, రెస్టరెంట్‌లోని రుచికరమైన పదార్థాలను కేవలం రూ.49లకే అందిస్తామంటోంది. ఈ ప్రత్యేకమైన రోజు కోసం ప్రత్యేకమైన ఐటెమ్స్‌ని కూడా తయారు చేయిస్తున్నారు. వాటన్నింటినీ ‘లవ్‌బాక్స్‌’ పెట్టి ప్రేమికులకు అందిస్తున్నారు. ఇందులో స్ట్రాబెర్రీ, చాక్లెట్లు, కుకీలు.. మొత్తం ఆరు రకాల వెరైటీలు ఉంటాయి. అన్నీ హృదయాకారంలోనే ఉండటం మరో ప్రత్యేకత. ఇవిగాక రాస్ప్‌బెర్రీ ఛీజ్‌కేక్‌, లోటస్‌ బిస్కఫ్‌, కాఫీ ఆల్మండ్‌ టార్ట్‌, లవ్‌ సింబల్‌ కేక్‌లు.. ఎన్నో అందుబాటులో ఉంచుతున్నారట. బేకరీ ఐటెమ్స్‌, అల్పాహారం, ఇతర డిష్‌లూ రూ.49కే అందిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని