కుర్రాళ్ల కోసం హీరోలాంటి బైక్‌

కుర్రకారే లక్ష్యంగా మరో మోటార్‌సైకిల్‌ విపణిలోకి వచ్చేసింది. హీరో మోటోకార్ప్‌ కంపెనీ.. మిడ్‌సెగ్మెంట్‌ విభాగంలో ఓ సూపర్‌ బైక్‌ని తీసుకొచ్చింది.

Published : 24 Feb 2024 00:15 IST

కుర్రకారే లక్ష్యంగా మరో మోటార్‌సైకిల్‌ విపణిలోకి వచ్చేసింది. హీరో మోటోకార్ప్‌ కంపెనీ.. మిడ్‌సెగ్మెంట్‌ విభాగంలో ఓ సూపర్‌ బైక్‌ని తీసుకొచ్చింది. అదే మావ్‌రిక్‌ 440. దాని ప్రత్యేకతలు ఏంటంటే.. 

  • మస్క్యులర్‌ ఫ్యుయెల్‌ ట్యాంకు, చంకీ వీల్స్‌, వెడల్పైన హ్యాండిల్‌బార్‌, సొగసైన్‌ ఎగ్జాస్ట్‌.. వీటన్నింటి మేటి కలయికతో చూడగానే ప్రీమియం మోటార్‌సైకిల్‌లా కనిపిస్తుంది.
  • టెలిస్కోపిక్‌ ఫోర్క్‌,  యూఎస్‌బీ ఛార్జింగ్‌ పోర్ట్‌, 175ఎంఎం భారీ భరీ గ్రౌండ్‌ క్లియరెన్స్‌, యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌.. సురక్షిత ప్రయాణానికి చిరునామాగా నిలుస్తాయి.
  • 440సీసీ.. 27బీహెచ్‌పీ, 36ఎన్‌ఎం టార్క్‌ ఇంజిన్‌తో దూసుకెళ్తుంది. హైవేలు, మట్టిరోడ్లు.. ఎలాంటి టెర్రైన్‌లో అయినా మేటి పికప్‌ దీని సొంతం.
  • రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 350, జావా 42, హోండా సీబీ 350లతో పోటీ పడుతోంది.
  • ధర రూ.1.99లక్షలు (ఎక్స్‌ షోరూం), రూ.2.24లక్షలు (టాప్‌ వేరియంట్‌)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని