నడక వెనక్కి.. ఫిట్‌నెస్‌ ముందుకి

పొద్దునే లేవడం.. నడకకో.. పరుగుకో బయల్దేరడం చాలామంది యువతకు అలవాటే. కానీ ఈమధ్యకాలంలో కొందరు పార్కుల్లో.. ట్రెడ్‌మిల్‌పై వెనక్కి నడవడం గమనించారా? ఇది ‘రివర్స్‌ వాకింగ్‌’ ట్రెండ్‌. ఈ ధోరణి ఊపందుకుంటోంది. నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.

Updated : 17 Mar 2024 00:02 IST

ఫిట్‌నెస్‌ మంత్ర

పొద్దునే లేవడం.. నడకకో.. పరుగుకో బయల్దేరడం చాలామంది యువతకు అలవాటే. కానీ ఈమధ్యకాలంలో కొందరు పార్కుల్లో.. ట్రెడ్‌మిల్‌పై వెనక్కి నడవడం గమనించారా? ఇది ‘రివర్స్‌ వాకింగ్‌’ ట్రెండ్‌. ఈ ధోరణి ఊపందుకుంటోంది. నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. పేరుకు తగ్గట్టే వెనకకి నడవడమే ఈ వ్యాయామం తీరు. ఎందుకిది మొదలైంది అంటే.. సాధారణంగా మనం ఎన్ని కఠోర కసరత్తులు చేసినా శరీరంలోని అన్ని కండరాలకు వ్యాయామం సరిపోదు. కానీ ఈ రివర్స్‌ వాకింగ్‌తో సాధారణ నడకకన్నా మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు. ఈ నడకతో బొటన వేలు.. మడమ.. మోకాలు.. తుంటి.. వంటి భాగాల్లో కండరాలు బాగా యాక్టివేట్‌ అవుతాయట. దాంతో..

  • వెన్నునొప్పి తగ్గుతుంది.
  • హామ్‌స్ట్రింగ్‌ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.
  • శరీరంపై నియంత్రణ కుదురుతుంది.
  • మెదడుకి రక్తప్రసరణ మెరుగవుతుంది.
  • శ్వాసప్రక్రియ సజావుగా కొనసాగుంది.
  • క్వాడ్రిసెప్స్‌ దృఢమవుతాయి.

..ఇలాంటి బోలెడు ప్రయోజనాలున్నాయి. అందుకే కుర్రకారు తెగ ఫాలో అవుతున్నారు. కానీ ఈ రివర్స్‌ వాకింగ్‌ అంత తేలికేం కాదు. మొదట్లో కష్టంగానే ఉంటుంది. కొత్తగా మొదలెట్టాలి అనుకునేవాళ్లు ముందు గార్డెన్‌ ప్రదేశాలు, ట్రెడ్‌మిల్‌, జిమ్‌.. తదితర ప్రదేశాల్లో ప్రారంభించాలి అంటుంటారు ఫిట్‌నెస్‌ నిపుణులు. కొద్దికొద్ది దూరం, సమయం పెంచుకుంటూ వెళ్లాలని సలహా ఇస్తున్నారు. రెగ్యులర్‌ వర్కవుట్‌లు చేస్తూనే.. మధ్యమధ్యలో దీన్నీ ప్రయత్నించొచ్చు అంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని