జిమ్‌కెళ్లగానే జీవితం మారదు!

జిమ్‌కెళ్లగానే జీవితం మారిపోతుంది. బరువులెత్తగానే కొవ్వు కరిగిపోతుంది. వర్కవుట్‌ చేయగానే ఒంటి తీరు బాగవుతుంది. ఇలాంటివి చాలానే వింటాం. ఇవి నూటికి నూరుశాతం నిజాలు కావంటున్నారు ఫిట్‌నెస్‌ గురూలు.

Published : 30 Mar 2024 00:03 IST

ఫిట్‌నెస్‌ మంత్ర

జిమ్‌కెళ్లగానే జీవితం మారిపోతుంది. బరువులెత్తగానే కొవ్వు కరిగిపోతుంది. వర్కవుట్‌ చేయగానే ఒంటి తీరు బాగవుతుంది. ఇలాంటివి చాలానే వింటాం. ఇవి నూటికి నూరుశాతం నిజాలు కావంటున్నారు ఫిట్‌నెస్‌ గురూలు. మరి అపోహలేంటి? నిజాలేంటి? అంటే..

  • పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగించడానికి ఫలానా వ్యాయామాలు చేస్తే చాలు అన్నది అపోహే. ఒక్కో వ్యాయామంతో ఒక్కో బాడీ పార్ట్‌ని తీర్చిదిద్దుకోవచ్చు అనుకుంటే పొరపాటే. ఏం చేసినా బాడీలోని కొవ్వు క్రమక్రమంగానే కరుగుతుంది తప్ప మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఎప్పుడు కావాలంటే అప్పుడు తగ్గించుకోవడం సాధ్యం కాదు.
  • ఎంత ఎక్కువ చెమట్లు చిందిస్తే.. అన్ని ఎక్కువ కేలరీలు కరుగుతాయన్నదీ అపోహే. కసరత్తులు శరీరంలోని అవయవాలను చల్లబరుస్తాయే తప్ప.. బాగా వ్యాయామం చేయడం ఎక్కువ ఫ్యాట్‌ కరిగించే కొలమానం కాదు.
  • కార్డియో వ్యాయామాలతోనే బరువు తగ్గుతారనే వాదన పూర్తిగా నిజం కాదు. స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌ వ్యాయామాలు సైతం బరువు తగ్గడానికి తోడ్పడతాయి. శరీరం మెటబాలిజం పెంచుతాయి. మజిల్‌మాస్‌ని అదుపులో ఉంచుతాయి.
  • పొట్టని కరిగించడానికి క్రంచెస్‌ మంచి వ్యాయామం అంటుంటారు. అది వాస్తవమే అయినా.. పొట్ట తగ్గడానికి క్రంచెస్‌తోపాటు సరైన డైట్‌, కోర్‌ స్ట్రెంగ్తెనింగ్‌ వ్యాయామాలూ తోడవ్వాల్సిందే. డైట్‌ని నిర్లక్ష్యం చేసి, అతిగా వ్యాయామం చేస్తామంటే అస్సలు కుదరదు.
  • ఎంత ఎక్కువ కష్టపడితే.. శరీరాన్ని ఎంత ఎక్కువ కష్టపెడితే అంత మంచి ఫలితం అన్నది నిజం కాదు. వ్యాయామం చేస్తున్నప్పుడు కలిగే బాధ కొన్నిసార్లు సరైన పద్ధతిలో చేయకపోవడం వల్ల కలుగుతుంది. కండరాలు పట్టేయడంతో కూడా ఈ నొప్పి ఉంటుంది.
  • జిమ్‌లో ఎక్కువసేపు ఉన్నంతమాత్రానే మంచి ఫలితాలు రావు. ఎంత సమయం ఉన్నామన్నదానికన్నా.. ఎంత నాణ్యంగా కసరత్తులు చేస్తున్నామన్నదే ముఖ్యం. అతిగా వర్కవుట్లు చేయడం వల్ల ఒక్కోసారి గాయాలు కావచ్చు. పనిలో నాణ్యత తగ్గొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని