అందమైన రహస్యం

ముప్ఫై ఎనిమిదేళ్ల వయసులోనూ ఇరవై ఏళ్ల అమ్మాయిలా కనిపించే అందాల భామ అదితీరావు హైదరీ. ఈమధ్యే పెళ్లికూతురైన ఈ అమ్మడు..

Published : 06 Apr 2024 00:19 IST

ముప్ఫై ఎనిమిదేళ్ల వయసులోనూ ఇరవై ఏళ్ల అమ్మాయిలా కనిపించే అందాల భామ అదితీరావు హైదరీ. ఈమధ్యే పెళ్లికూతురైన ఈ అమ్మడు.. క్రమంతప్పని వ్యాయామం, కఠినమైన ఆహార నియమాలే నా ఫిట్‌నెస్‌ రహస్యం అంటోంది. ఆ విషయానికొస్తే..

  • మనసు అందంగా ఉంటే.. బయటికి అందంగా కనిపించడం తేలికేనంటోంది అదితి. తన అంతఃసౌందర్యం యోగానట. రోజుకి అరగంటపాటు యోగా చేస్తుంది. దీంతో మనసు ప్రశాంతంగా ఉండటంతోపాటు శరీరం ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్‌ పెరుగుతుందట.
  • శరీరం చురుగ్గా కదలడానికి, ఫిట్‌గా ఉండటానికి తను ఎంచుకునేవి ఫంక్షనింగ్‌ వ్యాయామాలు, పైలేట్స్‌, నృత్యంతో కూడిన కసరత్తులు.
  • శరీరానికి శక్తినిచ్చేందుకు సమతుల ఆహారం తీసుకుంటుంది. విటమిన్లు, మినరల్స్‌, యాంటీఆక్సిడెంట్లే ఆమె డైట్‌లో ఎక్కువ. ఆహారంలో తప్పనిసరిగా పండ్లు, కూరగాయలుంటాయి. కొవ్వులు, మాంసాహారం తక్కువ.
  • పని ఒత్తిడి, ఇతర చికాకుల నుంచి ఉపశమనం కోసం ధ్యానం ఉపయోగపడుతుంది అని చాలాసార్లు చెప్పింది అదితి. దీర్ఘశ్వాస, మైండ్‌ఫుల్‌నెస్‌ కిటుకులు.. తన మనసు, మెదడుని ప్రశాంతంగా ఉంచుతాయట. వీటన్నింటితోపాటు శరీరానికి తగినంత నిద్ర ఉన్నప్పుడే శక్తిని తిరిగి పుంజుకుంటుంది కాబట్టి.. రోజుకి ఏడెనిమిది గంటలు తప్పకుండా నిద్ర పోతానంటోంది.
  • వీటితోపాటు చురుకైన జీవనశైలి ఎంచుకుంటుంది. సైక్లింగ్‌, హైకింగ్‌, ట్రెక్కింగ్‌.. ఇలాంటి ఔట్‌డోర్‌ సాహసాలు తన ప్రణాళికలో ఉంటాయి. ప్రకృతికి దగ్గరవంతోపాటు శారీరక శ్రమ అలవాటయ్యేలా చేసే మార్గాలివి అంటోంది అదితి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని