Andhra News: బాలినేని శ్రీనివాసరెడ్డితో సజ్జల భేటీ.. మంత్రివర్గ విస్తరణ అంశాలపై చర్చ

బాలినేని శ్రీనివాసరెడ్డితో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. విజయవాడ బందరు రోడ్డులోని బాలినేని నివాసానికి వెళ్లిన సజ్జల మంత్రివర్గ విస్తరణ అంశాలపై ఆయనతో చర్చించినట్టు తెలుస్తోంది.

Updated : 10 Apr 2022 16:21 IST

విజయవాడ: బాలినేని శ్రీనివాసరెడ్డితో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. విజయవాడ బందరు రోడ్డులోని బాలినేని నివాసానికి వెళ్లిన సజ్జల మంత్రివర్గ విస్తరణ అంశాలపై ఆయనతో చర్చించినట్టు తెలుస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్‌ను మంత్రివర్గంలో కొనసాగించి, తనను తొలగించడంపై బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఈనేపథ్యంలో సజ్జల స్వయంగా బాలినేని ఇంటికి వచ్చి చర్చలు జరపడం చర్చనీయాంశంగా మారింది.  మరో వైపు బాలినేని అనుచరులు, మద్దతుదారులు ఆయన నివాసం వద్దకు చేరుకుంటున్నారు. బాలినేనిని మంత్రివర్గంలో కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మంత్రి పదవి ఆశిస్తున్న వారు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫోన్‌ స్విచ్ఛాఫ్ చేసి అందుబాటులో లేరు. పల్నాడుకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు మాచర్లలో సమావేశమై పిన్నెల్లికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.  మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. బాలినేనితో జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... జిల్లాలో తానే సీనియర్‌నని, మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. సీఎం జగన్‌ ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తానని తెలిపారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని