Andhra News: ఇసుక కోసం.. నదిలోనే అడ్డంగా దారి

ఇసుక తరలించడానికి ఏకంగా నదిలోనే రోడ్డు వేసుకుంటున్నారు. ప్రవాహం కొనసాగుతున్నా అడ్డంగా పైపులు ఏర్పాటు చేసి మట్టి పోస్తున్నారు.

Updated : 30 Jan 2023 08:29 IST

ఇసుక తరలించడానికి ఏకంగా నదిలోనే రోడ్డు వేసుకుంటున్నారు. ప్రవాహం కొనసాగుతున్నా అడ్డంగా పైపులు ఏర్పాటు చేసి మట్టి పోస్తున్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా చెన్నూరు, ఖాజీపేట మండలాల పరిధిలోని పెన్నానది మధ్యలో ఇసుక మేటలు ఉన్నాయి. అక్కడికి వాహనాలు వెళ్లడానికి వీలుగా గుత్తేదారులు ప్రత్యేకంగా రోడ్డు వేసుకుంటున్నారు. వంతెనల సమీపంలో తవ్వకాలు జరపకూడదు. కర్నూలు-కడప జాతీయ రహదారి పక్కన నిర్మించిన ప్రధాన వంతెన పక్కనున్న మట్టిని తరలిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో రెండు ప్రధాన వంతెనలు వరద తాకిడికి కొట్టుకుపోయాయి. అవి ఇప్పటికీ మరమ్మతుకు నోచుకోలేదు. కడప-కర్నూలు జాతీయ రహదారి పక్కనే ఇదంతా జరుగుతున్నా.. అధికారులు పట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై ఖాజీపేట తహసీల్దారు రమణారెడ్డిని వివరణ కోరగా, పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

ఈనాడు, కడప, న్యూస్‌టుడే, మైదుకూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని