పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగానికి గడువు పొడిగించాలి

పోలింగ్‌ ముందు రోజు వరకు పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగానికి అనుమతించాలని నవ్యాంధ్ర టీచర్స్‌ అసోసియేషన్‌, ఏపీ ఉపాధ్యాయ సంఘం వేర్వేరు ప్రకటనల్లో ఎన్నికల సంఘాన్ని కోరాయి.

Published : 04 May 2024 04:58 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పోలింగ్‌ ముందు రోజు వరకు పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగానికి అనుమతించాలని నవ్యాంధ్ర టీచర్స్‌ అసోసియేషన్‌, ఏపీ ఉపాధ్యాయ సంఘం వేర్వేరు ప్రకటనల్లో ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఈ నెల 5న నీట్‌ పరీక్ష, ఎన్నికల శిక్షణ తరగతులు ఉన్న కారణంగా పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగానికి తగు సమయమివ్వాలనిశుక్రవారం విజ్ఞప్తి చేశాయి. మహిళా ఉద్యోగులు ఇబ్బంది లేకుండా పనిచేసేందుకు పక్క నియోజకవర్గాల్లో ఎన్నికల విధులు కేటాయించాలన్నాయి. ఫాం-12 దరఖాస్తులు ఇవ్వలేని ఉద్యోగులకు మరో అవకాశం ఇవ్వాలని కోరాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని